ByMohan
Tue 12th Mar 2024 12:04 PM
ఏ హీరోయిన్ అయినా కెరీర్‌లో డౌన్ అయితే అటు సోషల్ మీడియాలోనూ డల్ గా కనిపిస్తారు. ఎప్పటికో తేరుకుని ఫోటో షూట్స్ అంటూ హడావిడి చేసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈమధ్యన పూజా హెగ్డే హ్యాట్రిక్ ప్లాప్స్‌ని చవిచూశాక సోషల్ మీడియాలోనూ మాయమైపోయింది. మళ్ళీ ఈమధ్యనే యాక్టీవ్ అయ్యింది. అగ్రతార సమంత మాత్రం అలా కాదు. ఆమె సినిమాల్లో నటించకపోయినా, నటనకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాని మాత్రం వదలకుండా ఏదో విధంగా ఉనికి చాటుకుంటూనే ఉంటుంది.
కొత్త కొత్త ఫోటో షూట్స్, లేదంటే లైఫ్ గురించో, కెరీర్ గురించి ట్వీట్స్ వేయడం, ఏదైనా ఇంటర్వూస్ లో పాల్గొనడం వంటి విషయాలతో తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గత ఆరేడు నెలలుగా సమంత నటనకు బ్రేకిచ్చి హెల్త్ విషయాలు చూసుకుంటున్నప్పటికీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూనే కనిపించింది. గ్లామర్ ఫోటో షూట్స్, షాప్ ఓపెనింగ్స్, హెల్త్ విషయాలు మాట్లాడుతూ తరచూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది.
తాజాగా సమంత సూటులో స్పెషల్ లుక్‌తో మతులు పోగొట్టేసింది. ఆ పిక్స్ లో చాలా అందంగా కనిపించింది. ఆమె గ్లామర్ గురించి, అద్భుతమైన లుక్ గురించి నెటిజెన్స్ మాట్లాడుకునేలా ఆ ఫోటో షూట్ ఉంది. సమంత లేటెస్ట్ పిక్స్‌ని ఓ లుక్కెయ్యండి.
Samantha Latest Photoshoot Pics Goes Viral:
Samantha Gives Kick with Latest Photoshoots