GossipsLatest News

ట్విన్స్.. నమ్మవద్దు: మంచు మనోజ్


మంచు మనోజ్, మౌనికా రెడ్డి దంపతులకు త్వరలో కవల పిల్లలు పుట్టబోతున్నారంటూ వైరల్ అవుతున్న వార్తలపై మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వార్తలు నమ్మవద్దు అని చెబుతూనే.. మా జీవితాలలోకి రానున్న బిడ్డల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామనేలా.. ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఏముందంటే.. 

అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం.. అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.

శుభవార్త: నా సతీమణి ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి. భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురుచూస్తున్నాం.

ఒక విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను: కవల పిల్లలు విషయంలో బయట వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు. ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడు మేము నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము. దయచేసి మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు. 

ఎల్లప్పుడూ.. మీరు మాపై చూపించే ఆదరాభిమానాలే మాకు శ్రీరామరక్ష.. కృతజ్ఞతలతో -మంచు మనోజ్



Source link

Related posts

అందుకే బాలయ్యకు నో చెప్పా.. జనసేనలో చేరడంపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్!

Oknews

ప్రభాస్ హీరోయిన్ అల్లు అర్జున్ తో జత కడుతుందా!

Oknews

Investment Know About Credit Card Balance Transfer And Charges Full Details

Oknews

Leave a Comment