Sports

Gujarat Titans wont miss Hardik Pandya Brad Hoggs bold IPL 2024 claim


Brad Hoggs Hot Comments On Hardik Pandya : మరికొన్ని రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ipl) ప్రారంభంకానుంది. ఈసారి ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ (MI) కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) జట్టుతో కలిశాడు. మరో తొమ్మిది రోజుల్లోనే ఐపీఎల్‌ ప్రారంభంకానున్న వేళ… ముంబై జట్టుతో నూతన సారధి హార్దిక్‌ కలిశాడు. వచ్చి రావడంతోనే పూజ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. సొంత ఫ్రాంచైజీకి తిరిగి వ‌చ్చిన పాండ్య మొద‌ట దేవుళ్ల చిత్ర ప‌టం వ‌ద్ద, ముంబై కోచ్ మార్క్‌బౌచ‌ర్‌తో క‌లిసి దీపం వెలిగించాడు. పాండ్యకు అంద‌రూ ఘ‌న స్వాగతం ప‌లికారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హాగ్‌ ఏమన్నాడంటే..
హార్దిక్‌పాండ్యా గుజరాత్‌ను వీడడడం ఆ జట్టుకు పెద్ద నష్టం కాదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. హార్దిక్‌ లేకున్నా గుజరాత్‌ టైటాన్స్‌ బలంగానే ఉందని పేర్కొన్నాడు. పాండ్య లేకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్దగా నష్టం కలిగించదని బ్రాడ్‌ హాగ్‌ వెల్లడించాడు. హార్దిక్‌ లేని లోటును గుజరాత్‌ పూడ్చుకోగలదని… ఆ జట్టుకు బలమైన బౌలింగ్‌ దళం ఉందని బ్రాడ్‌ హాగ్‌ అన్నాడు. హార్దిక్‌ లేకున్నా గుజరాత్ పటిష్టంగానే ఉందన్నాడు. ముంబై తరఫున తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నానని బ్రాడ్ హాగ్ వివరించాడు. 

వెనక ఇంత జరిగిందా..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అభిమానుల హృదయం ముక్కలైంది. ముంబై టీమ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను పక్కన పెట్టిన ముంబై టీమ్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. దీంతో వివాదం చెలరేగింది.  

అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తరఫున రోహిత్ ఆడటం చూడాలని ఉందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు అంబటి రాయుడు  అభిప్రాయపడ్డాడు . ముంబై తరఫున చాలా కాలంపాటు రోహిత్‌ ఆడాడని ఇప్పుడు సీఎస్‌కేకు ఆడి విజయాల్లో పాలుపంచుకుంటే బాగుంటుందని అంబటి రాయుడు తెలిపాడు. ఈ ఏడాది రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగాల్సిందని.. వచ్చే ఏడాది హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించాల్సిందని.. ముంబై టీమ్ ఏదో తొందరలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఉందని అంబటి తెలిపాడు. రోహిత్‌కు సరైన పిలుపు వస్తుందని భావిస్తున్నానని. అయితే, అతడు తీసుకుంటాడో.. లేదో వేచి చూడాలని రాయుడు వ్యాఖ్యానించాడు.  రోహిత్ మరో ఐదారేళ్లు ఆడగలడని, అందువల్ల అతడిని సీఎస్కే తీసుకుంటే బాగుంటుందని అంబటి రాయుడు తెలిపాడు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Axar Patel Won Man of the Match Award in Ind vs Eng Semi Final T20 World Cup 2024 | Axar Patel MoM Award Ind vs Eng Semi Final

Oknews

World Cup 2023, IND Vs PAK: Gautam Gambhir Calls Jasprit Bumrah As Most Lethal Bowler In World Cricket

Oknews

Williamson Goes Past Virat Kohli In Century List

Oknews

Leave a Comment