GossipsLatest News

Megastar Chiranjeevi Message To New Voters నవ ఓటర్లకు మెగాస్టార్ పిలుపు



Wed 13th Mar 2024 12:52 PM

chiranjeevi vote  నవ ఓటర్లకు మెగాస్టార్ పిలుపు


Megastar Chiranjeevi Message To New Voters నవ ఓటర్లకు మెగాస్టార్ పిలుపు

నా మొదటి ఓటు దేశం కోసం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కొత్తగా ఓటు హక్కును సంపాదించుకున్న వారిని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌ను పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి రీ ట్వీట్ చేస్తూ.. దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ మొదటి ఓటును వినియోగించండి అంటూ పిలుపునిచ్చారు. చాలా రోజుల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ సందేశాన్నిచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేరు. విశ్వంభర షూట్‌లో బిజీబిజీగా ఉన్నారు.  

మన దేశ 18వ లోక్ సభ ఎలక్షన్లు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయస్సు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు – మనరాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా నవ ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం చిరు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

త్వరలోనే ఎన్నికల హడావుడి మొదలవ్వబోతోంది. కొత్తగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి నిజంగా ఇది గ్రేట్ మూమెంట్. మొట్టమొదటి ఓటును పలానా పార్టీకి వేశామని చెప్పుకునే సందర్భమిది. అందుకే అందరూ ఆలోచించి.. దేశ భవిష్యత్తు కోసం మీ ఓటును వినియోగించాలంటూ పిలుపునిచ్చారు.


Megastar Chiranjeevi Message To New Voters:

Mera Pehla Vote Desh Ke Liye Message From Modi
 









Source link

Related posts

‘జీన్స్‌’ ప్రశాంత్‌ వీడియో వైరల్‌.. పోలీసులేం చేస్తున్నారు.. నెటిజన్స్‌ ఫైర్‌!

Oknews

Tight Security In Hyderabad Ahead Of Ram Temple Event

Oknews

Nayanthara in a superb look సూపర్బ్ లుక్ లో నయనతార

Oknews

Leave a Comment