Entertainment

హీరో గోపీచంద్ గురించి ఆయన భార్య రేష్మ చెప్పిన మాటలు వింటే…


వివాదాల్లేని, అందరూ ఇష్టపడే అతి కొద్ది మంది హీరోలలో మాచో స్టార్ గోపీచంద్ ఒకరు. గోపీచంద్ గురించి సినీ పరిశ్రమలో అందరూ పాజిటివ్ గానే చెబుతుంటారు. అలాంటి మ్యాన్లీ హీరో గురించి తాజాగా ఆయన భార్య రేష్మ చెప్పిన మాటలు ముచ్చటగా ఉన్నాయి.

ఇటీవల ‘భీమా’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు గోపీచంద్. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘ఆలీతో సరదాగా’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హోస్ట్ ఆలీ.. వీడియో కాల్ ద్వారా మీ భార్య రేష్మతో సంభాషించాలని కోరాడు. అలా వీడియో కాల్ ద్వారా ఈ షోలో కనిపించిన రేష్మ.. గోపీచంద్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

గోపీచంద్ నటించిన చిత్రాల్లో మీ ఫేవరెట్ సినిమాలేవి? అని ఆలీ అడగగా.. “సాహసం” అని చెప్పింది రేష్మ. అంతేకాదు.. దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన కుటుంబ కథా చిత్రాలంటే ఎంతో ఇష్టమని, ఆయన డైరెక్షన్ లో గోపీచంద్ చేసిన ‘మొగుడు’ చిత్రమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

గోపీచంద్ లో నచ్చే విషయం ఏంటి? నచ్చని విషయం ఏంటి? అని ఆలీ అడగగా.. “నచ్చని విషయం ఏంటంటే.. అందరినీ త్వరగా నమ్మేస్తారు. నచ్చే విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఆయన స్వీట్ హార్ట్ పర్సన్. బాగా అర్థం చేసుకుంటారు. లవ్ లీ హస్బెండ్. అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఫ్రెండ్ షిప్ కి వాల్యూ ఇస్తారు. ఈరోజుల్లో ఫ్రెండ్ షిప్ కి అంత వాల్యూ ఇచ్చే పర్సన్ ని చూడలేదు. మదర్ ని, వైఫ్ ని, కిడ్స్ ని ఇలా ఫ్యామిలీలో అందరినీ చాలా బాగా చూసుకుంటారు. ఆయనను చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తి నా భర్తగా దొరకడం నా అదృష్టం. నేను దేవుడిని కోరుకున్న దానికంటే గొప్ప హస్బెండ్ వచ్చాడు” అంటూ భర్త గోపీచంద్ గురించి తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టింది రేష్మ. ఆమె మాటల్లో భర్తపై ఉన్న ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీకి గోపీచంద్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అర్థమవుతోంది.



Source link

Related posts

ఓటీటీ సంస్థల్లో నెంబర్‌ వన్‌ ఏదో.. సబ్‌స్క్రైబర్స్‌ ఎంతమందో తెలుసా?

Oknews

ప్రముఖుల సమక్షంలో వైభవంగా ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్ 

Oknews

Bollywood star actor Rishi Kapoor Passed Away

Oknews

Leave a Comment