BJP Releases Second Candidates List Karnataka CM Basavaraj Bommai Nitin Gadkari: న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఇదివరకే తొలి జాబితా విడుదల చేసింది. తాజాగా బుధవారం (మార్చి 13న) 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేయగా, రెండో జాబితాలో బీజేపీ అధిష్టానం మరో 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచింది.
BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections pic.twitter.com/bpTvxfMkDr
— ANI (@ANI) March 13, 2024
రెండు జాబితాలలో కలిపి బీజేపీ ఇప్పటివరకూ 267 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. తాజా జాబితా పరిశీలిస్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, నాగ్‌పూర్ నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముంబై నార్త్ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, హవేరీ నుంచి కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఉత్తరాఖండ్ లోని గర్హవాల్ నుంచి అనిల్ బలూని, కర్ణాల్ నుంచి హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అంబాలా నుంచి బాంటో కటారియా, గురుగ్రామ్ నుంచి రావు ఇంద్రజిత్ సింగ్ యాదవ్, ఫరీదాబాద్ నుంచి క్రిషన్ పాల్ గుర్జార్, సిర్సా నుంచి అశోక్ తన్వర్, భివానీ- మహేంద్రగఢ్ నుంచి ధరంబీర్ సింగ్, ఫరీదాబాద్ నుంచి క్రిష్ణన్ పాల్ గుర్జార్ లకు ఛాన్స్ ఇచ్చింది.
తెలంగాణ నుంచి వీరికి ఛాన్స్
మహబూబ్ నగర్ – డీకే అరుణ
ఆదిలాబాద్ – గోడం నగేష్
నల్లగొండ – సైదిరెడ్డి
మహబూబాబాద్ – సీతారామ్ నాయక్
మెదక్ – రఘునందన్ రావు
పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్
మరిన్ని చూడండి