EntertainmentLatest News

బన్నీ, అట్లీ మూవీ.. రెమ్యూనరేషన్లకే రూ.300 కోట్లు!


ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ మూవీ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. ‘పుష్ప-2’ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాలు స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ  గ్యాప్ లో మరో సినిమా పూర్తి చేయాలని బన్నీ భావిస్తున్నట్లు ఆమధ్య వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా డైరెక్టర్ అట్లీ పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ మూవీ ఓకే అయినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ప్రకటించనున్నారని సమాచారం. ఈ ఏడాది చివరిలో షూటింగ్ స్టార్ట్ కానుందట. వచ్చే ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

‘జవాన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అందుకే ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ ఈ సినిమా కోసం రూ.120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట. అంటే హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కలిపితే ఏకంగా రూ.180 కోట్లు. ఇక ఇతర నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు కూడా కలిపితే.. కేవలం పారితోషికాలకే రూ.300 కోట్లు అవుతుంది. ఈ లెక్కన ఈ సినిమా బడ్జెట్ కనీసం రూ.500 కోట్లు అయ్యే అవకాశముంది.



Source link

Related posts

Lok Sabha Election 2024 BJP Releases Second Candidates List Karnataka CM Basavaraj Bommai Nitin Gadkari

Oknews

Politics that will not leave NTR! ఎన్టీఆర్‌ను వదలని రాజకీయం!

Oknews

Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం – పజిల్‌గా మారిన కేసు!

Oknews

Leave a Comment