Latest NewsTelangana

Todays top five news at Telangana Andhra Pradesh 14 March 2024 latest news | Top Headlines Today: బీజేపీ కీలక నేత ఇంటికి రేవంత్; సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు


కర్నూలు పార్లమెంటులో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా..

రాయలసీమ ముఖద్వారం కర్నూలు. లోక్ సభ నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి (Kotla Vijayabhaskar Reddy) ఆయన తనయుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి(Kotla Jayasurya Prakash Reddy) కేంద్ర పదవులు చేపట్టారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అలాగే అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి  అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్య(Damodaram Sanjeevayya) కూడా ఇక్కడి వారే. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పునర్విభజన జరగక ముందు 6 అసెంబ్లీలో స్థానాల్లో ఉండేది. ఇంకా చదవండి

కాంగ్రెస్‌లోకి బీజేపీ కీలక నేత

మాజీ ఎంపీ , సీనియర్ బీజేపీ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోని జితేందర్ రెడ్ి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వెంట  మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ ప‌ట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీలో చేరేందుకు జితేందర్ రెడ్డి అంగీకరించారు. బీజేపీలో మహబూబ్ నగర్ టిక్కెట్ ను జితేందర్ రెడ్డి ఆశించారు. అయిేత ఆ స్థానాన్ని డీకే అరుణకు ఇచ్చారు. అసంతృప్తికి గురైన జితేందర్ రెడ్డితో కాంగ్రెస్ చర్చలు జరిపింది. ప్రస్తుతం మల్కాజిగిరి కోసం బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెదుకుతోంది. జితేందర్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అలా చేశా’ – ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను అలా చేశానని.. ఆ డేటాను కూడా ధ్వంసం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ప్రత్యేక టీం భావిస్తోంది. ఇంకా చదవండి

‘మాయల మాంత్రికులపై ‘ఓటు’ దివ్యాస్త్రం ప్రయోగించండి’

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) 2014లో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు పవన్, బీజేపీతో కూటమితో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని సీఎం జగన్ (CM Jagan) మండిపడ్డారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఈబీసీ నిధుల విడుదల సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో రూ.629.37 కోట్లు బటన్ నొక్కి జమ చేశారు. ‘మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు.’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంకా చదవండి

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ

 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండోజాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది. రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు వీళ్లే ఇంకా చదవండి   

మరిన్ని చూడండి



Source link

Related posts

ప్రియదర్శి మామూలోడు కాదు..బయటపడ్డ భారీ బిజినెస్ 

Oknews

3 Movies Ready for Maha Shivratri Release మార్చి 8.. మరో మాంచి ఫైట్ రెడీ!

Oknews

Medigadda Barrage| Konda Vishweshwar Reddy | Medigadda Barrage| Konda Vishweshwar Reddy

Oknews

Leave a Comment