Latest NewsTelangana

TS PECET 2024 Application Process started check last date here


Telangana PECET 2024 Application: తెలంగాణలోని వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్ 2024 నోటిఫికేషన్ మార్చి 12న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీపీఎడ్‌(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 14న ప్రారంభంకాగా..  మే  15 వరకు ఆన్‌లైన్‌ ద‌రఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఆల‌స్య రుసుముతో మే 31 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ు స‌మ‌ర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు పరీక్షలు నిర్వహించ‌నున్నారు. జూన్ నాలుగో వారంలో ఫ‌లితాల‌ు విడుద‌ల చేయ‌నున్నారు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థుల నుంచి రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడాది టీఎస్ పీఈసెట్‌ను శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ నిర్వ‌హించనుంది. పీఈసెట్ ద్వారా రాష్ట్రంలోని 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లను భర్తీ చేయనున్నారు.  

వివరాలు…

* టీఎస్‌పీఈసెట్ (TS PECET)- 2024 

⫸ బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)

⫸ డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)

అర్హతలు..

➥ బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

➥ డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి..

➥ బీపీఈడీ కోర్సుకు అభ్యర్థుల వయసు 2024, జులై 1 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి.

➥ డీపీఈడీ కోర్సుకు అభ్యర్థుల వయసు 2024, జులై 1 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.900. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET), స్కిల్ టెస్ట్ (Skill Test) ఆధారంగా.

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ విధానం..

➥  మొత్తం 400 మార్కులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (PET) నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు ఈవెంట్లు ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయించారు.

➥ వీటిలో పురుషులకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 800 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(6 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ ఇక మహళలకు 100 మీటర్ల పరుగు-100 మార్కులు, 400 మీటర్ల పరుగు-100 మార్కులు, షాట్‌పుట్(4 కేజీలు)-100 మార్కులు, లాంగ్ జంప్/హైజంప్-100 మార్కులు ఉంటాయి.

➥ గర్భిణీ స్త్రీలు అనర్హులు.

స్కిల్ టెస్ట్ (Skill Test) ఇలా..

ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కింది స్పోర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు పరీక్షిస్తారు. 

అవి: బాల్ బ్యాడ్మిండన్, బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, వాలీబాల్.

Scheme of Examination

ముఖ్యమైన తేదీలు..

➥ పీఈసెట్ -2024 నోటిఫికేషన్ వెల్లడి: 12.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.05.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.05.2024.

➥ రూ.2000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2024.

➥ పరీక్షల నిర్వహణ: జూన్ 10 నుంచి 13 వ‌ర‌కు.

Notification

 Application Fee Payment

 Check your Payment Status

 Application Form

Print Your Filled in Application Form

WEBSITE

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

Digital Payments Chartered Planes In Telangana On Election Commission Radar

Oknews

Janhvi Kapoor a happy and joyous birthday! దేవర గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది

Oknews

Bhagavanth Kesari 2nd collection భగవంత్ కేసరి రెండోరోజు లెక్కలు

Oknews

Leave a Comment