దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ కొత్త డ్రెస్, యాక్సెసరీస్ వంటివి ధరించినప్పుడు అద్దంలో చూసుకొని మురిసిపోతుంటారు. తమకు నప్పాయో లేదో, అందంగా అనిపిస్తున్నామో లేదో అని చెక్ చేసుకుంటారు. అయితే అలా అద్దంలో చూసుకుంటున్నప్పు మీరు వేసుకున్న ఆ దస్తులు అసలు ఎలా వచ్చాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే టీషర్ట్ నుంచి ప్యాంటు వరకు అన్ని రకాల డ్రెస్సులు మనం అందంగా, హుందాగా, అట్రాక్షన్‌గా కనిపించడంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. పైగా డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్ గల డ్రెస్సులు, షూస్, అదర్ యాక్సెసరీస్ వంటివి ధరించడానికి మనం ఇష్టపడుతుంటాం. మనం అనుసరించే ఈ మోడర్న్ ఫ్యాషన్ ట్రెండ్ యొక్క అసలు మూలాలు చరిత్ర పుటల్లో దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
టీ షర్టులు
ప్రజెంట్ టీ షర్టు ధరించని వారు ఎవరూ ఉండరు. స్త్రీలు, పురుషులు వీటిని ఇష్టపడతారు. అయితే మొదట వీటిని ధరించిన పూర్వీకులను పురాతన రోమ్‌లో కనుగొనవచ్చు. ఇక్కడ ట్యూనిక్స్ ధరిస్తారు. కానీ మోడర్న్ టి-షర్ట్ మాత్రం 19వ శతాబ్దపు ‘యూనియన్ సూట్’కి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా వన్సీ ఈ కోవకు చెందినదే. ఇవి మొదట 1904లో కూపర్ అండర్‌వేర్ కంపెనీ ద్వారా కమర్షియలైజ్డ్ చేయబడ్డాయి. తరువాత యునైటెడ్ స్టేట్స్ నేవీ ద్వారా స్వీకరించబడ్డాయి. ‘‘T షర్టు’’ అనే పదానికి సంబంధించి, ఇది మొదట F ఆకారం కలిగిన ప్రింట్‌లో కనిపించింది. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ యొక్క 1920 పుస్తకం ‘దిస్ సైడ్ ఆఫ్ ప్యారడైజ్’ 1940ల నాటికి T- షర్టు ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ కొనసాగుతోంది.
బ్రాలు
ప్రస్తుతం బ్రాలు ధరించని మహిళలంటూ ఎవరూ ఉండరు. అయితే ఇవి ఆధునిక కాలంలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయని అనుకుంటారు. కానీ వాటి మూలాలు పురాతన గ్రీస్ అండ్ రోమన్ సంస్కృతిలో ఉన్నాయి. అప్పట్లో స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మహిళలు తమ రొమ్ములకు సపోర్టుగా బట్టలతో చుట్టుకునేవారట. క్రమంగా అండర్ గార్మెంట్‌గా పరిణామం చెందాయి. అయితే 1913లో మొదటిసారిగా న్యూయార్క్ సామాజిక వేత్త మేరీ ఫెల్ప్స్ జాకబ్ (అకా కారెస్సే క్రాస్బీ) మోడర్న్ బ్రా రూపకల్పనపై పేటెంట్ పొందారు.
హై హిల్స్
వాస్తవానికి హైహీల్స్ మొదట పురుషులు ధరించేవారట. పర్షియన్లు, ఇతర సంస్కృతులలో చెక్క రూపంలో వీటిని ధరించేవారు. కానీ 16వ శతాబ్దం చివరిలో ఐరోపాకు తీసుకు ఈ సంస్కృతి పాకడంతో అవి ప్రజాదరణ పొందాయి. ఇక 17వ శతాబ్దం నాటికి రాయల్స్ వాటిని ధరించేవారు. ఫ్రాన్స్‌కు చెందిన కింగ్ లూయిస్ XIV హైహీల్స్ ధరించాడు. ఆ శతాబ్దం చివరి వరకు మహిళలు వాటిని ధరించడం ప్రారంభించారు.
నెక్ టైస్
ఫ్రాన్స్ కింగ్ లూయిస్ XIV కేవలం హై హీల్ షూస్ ధరించడమే కాదు, అతను నెక్‌టై వాడకాన్ని కూడా మొదట ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనతను కూడా పొందాడు. నెక్ టై ఎర్లీ వెర్షన్ క్రొయేషియన్ కిరాయి సైనికులలో ఇప్పటికీ ప్రముఖంగా ఉంది. ఆ తర్వాత పారిసియన్లు దీనిని స్వీకరించారు. టై మొదట లేస్ లేదా సిల్క్‌తో తయారు చేయబడింది. ఇప్పుడు మోడర్న్ క్లాత్ యూజ్ చేస్తున్నారు.
ప్యాంట్స్
ప్యాంట్ గురించి అందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు కనుగొనబడిన ఓల్డెస్ట్ ప్యాంటు 3,000-3,300 సంవత్సరాల క్రితం నాటిది. వీటిని సెంట్రల్ ఆసియాలోని సంచార గుర్రపు సైనికులు ఉపయోగించారు. అనేక ఇతర ప్రాచీన సంస్కృతుల వారు కూడా ధరించారు. కానీ పురాతన గ్రీకులు, రోమన్లు వాటిని స్వీకరించడానికి కొంత సమయం పట్టింది. రోమన్లు ప్యాంటును అనాగరికమైన వ్యక్తులు ధరించారని నమ్ముతారు. కానీ సామ్రాజ్యం మధ్యధరా భూ భాగాన్ని దాటి విస్తరించినప్పుడు. వారి అభిప్రాయం మార్చుకున్నారు.
సూట్స్
సూట్ ఇప్పటికీ సజీవంగా ఉంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? అనేది చాలా మందికి తెలియదు. కానీ 19వ శతాబ్దపు ఇంగ్లీష్ డాండీ జార్జ్ ‘‘బ్యూ’’ బ్రమ్మెల్ దానిని మొదట ధరించాడట. ‘‘ప్రాక్టికల్ ఇంగ్లీష్ కంట్రీ జెంటిల్‌మన్ డ్రెస్‌తో కూడిన ఫార్మల్ మిలటరీ యూనిఫాం యొక్క హైబ్రిడ్ మోడర్న్ సూట్‌కు ప్రీ-కర్సర్‌ను నిజంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన మొదటి వ్యక్తి బ్రమ్మెల్’’ అని ఆస్ట్రేలియన్ మెన్స్ వియర్ బ్రాండ్ బ్రాండ్ M.J. బేల్ ఫౌండర్ మాట్ జెన్సన్ చెప్పారు.
స్విమ్ సూట్
19వ శతాబ్దం తర్వాత ప్రజలు ఎక్కువగా సముద్రతీరానికి వెళ్లడానికి ఇష్టపడేవారు. అయితే అక్కడ స్త్రీలు స్నానపు దుస్తులను ధరిస్తారు. ఇది కాలక్రమేణా మరింత ఫారమ్ ఫిట్‌గా మారింది. ఆ తర్వాత సుమారు 1905లో ఆస్ట్రేలియన్ ప్రో స్విమ్మర్ అన్నెట్ కెల్లర్‌మాన్ మొదటగా స్విమ్ సూట్ ధరించింది. ఆమె వన్-పీస్ అథ్లెటిక్ స్విమ్మింగ్ సూట్ ధరించి అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఒకసారి అరెస్టు చేయబడింది కూడా!
లెగ్గింగ్స్
లెగ్గింగ్ లేనిదే ఈ రోజు ఏ అమ్మాయి ఉండట్లేదు. చాలా సంవత్సరాలుగా అనేక వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు రోజు ధరించే మోడర్న్ వెర్షన్‌కు చాలా సారూప్యమైనది మధ్యయుగ ఐరోపాలో పురుషులు ధరించే గొట్టం అంటున్నారు నిపుణులు.1959లో మొట్టమొదటి లైక్రా లెగ్గింగ్స్ సృష్టించబడింది. ఆ తర్వాత 1960ల నుంచి మహిళలు క్రమం తప్పకుండా లెగ్గింగ్స్ ధరించడం ప్రారంభించారు. ఇప్పుడు ఇవి చాలా ఫేమస్ .
టోపీలు
మానవ చరిత్రలో అతిపురాతన కాలం నుంచి తలలు కప్పుకోవడం కొనసాగుతూ వస్తోంది. ఫేమస్ Ötzi ది ఐస్‌మ్యాన్ ఇందుకు ఒక ఉదాహరణ. అతను ఎలుగుబంటి టోపీతో కనుగొనబడ్డాడు. ఇది 5,300 సంవత్సరాల క్రితం నాటిది. ఈజిప్టులో గల థెబ్స్‌లోని ఒక సమాధిలో సుమారు 3200 (BCE) ఏండ్ల నాటి టోపీ యొక్క పురాతన డ్రాయింగ్ కనుగొనబడింది. మానవులు ఎంతకాలంగా తమ తలలను అలంకరించుకుని రక్షించుకుంటున్నారో ఇది తెలియజేస్తుంది.
జీన్స్
నేడు జీన్స్ ధరించడం ఒక ఫ్యాషన్. కానీ ఐకానిక్ బ్లూ జీన్స్‌ను 19వ శతాబ్దం చివరలో లెవీ స్ట్రాస్ అండ్ జాకబ్ డేవిస్ నెవాడాలోని మైనర్ల కోసం కనుగొన్నారు. నీలిరంగు డెనిమ్ లెవీస్ 501 ఏండ్ల నాటి మొదటి జత 1890లో తయారు చేయబడింది. అవి నేటికీ ఫ్యాషన్‌లో ప్రధానమైనవి.
ప్యాంటీస్
మానవులు శతాబ్దాలుగా లోదుస్తులను ధరిస్తున్నారు. అయితే ప్రతి కాలుకు రెండు వేర్వేరు తొడుగులను కలిగి ఉండే సాంప్రదాయక వన్-పీస్ ప్యాంటీస్ 1600లలో మాత్రమే కనిపించింది. ఇవి డిఫరెంట్ ఫార్మాట్స్‌తో సంవత్సరాలుగా వివిధ డిజైన్లలో అభివృద్ధి చెందాయి. 1800ల చివరలో విక్టోరియన్ దుస్తుల సంస్కరణ ఇందుకు ఆజ్యం పోసింది. ఉదాహరణకు మహిళల కోసం మరింత ఆచరణాత్మకమైన దుస్తులను (లోదుస్తులతో సహా) ప్రవేశపెట్టింది.
హవాయి షర్టులు
అలోహ షర్టులు లేదా హవాయి షర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఈ పాపులర్ బటన్‌లతో కూడిన దుస్తులతో తయారు చేసే షర్టులు ఫ్లోరల్ పాటర్న్స్ తో ఉంటాయి. మొదట 1920లలో హవాయిలో నివసిస్తున్న జపనీస్ మహిళల ధరించడం ద్వారా గుర్తించబడ్డాయి. ఈ మహిళలు చొక్కాలను రూపొందించడానికి కిమోనో ఫాబ్రిక్‌ను ఉపయోగిస్తారు. క్రమంగా వాటికి ప్రజాదరణ పెరుగుతూ వచ్చింది. 1960ల నాటికి చాలా మంది ప్రముఖులు (ఉదా. ఎల్విస్ ప్రెస్లీ) వాటిని ధరించారు.
వైట్ వెడ్డింగ్ డ్రెస్
పెళ్లిరోజు తెల్లటి దుస్తులు ధరించడం ఎంతో కాలంగా కొనసాగుతోంది. అయితే దీని మూలాలు గత చరిత్రలో ఉన్నాయి. మీరు ఇన్ స్పో కోసం క్వీన్ విక్టోరియాకు థ్యాంక్స్ చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రిన్స్ ఆల్బర్ట్‌ను వివాహం చేసుకున్నప్పుడు వైట్ వెడ్డింగ్ డ్రెస్ ధరించడం ద్వారా విక్టోరియా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
కార్గో ప్యాంట్స్
ప్రస్తుతం కార్గో ప్యాంట్స్ ధరించడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే 1930 నుంచి 40లలో బ్రిటిష్ సైనికులు వీటిని మిలిటరీ యూనిఫారంగా ధరించారట. WWII సమయంలో అమెరికన్లు మొదట మల్టీ -పాకెట్ ప్యాంట్లను పరిచయం చేశారు. వారి యూనిఫాంలో భాగంగా వాటిని స్వీకరించారు.