EntertainmentLatest News

నిహారికపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్‌ చేసిన మాజీ భర్త!


సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. విడాకుల తర్వాత ఎవరి కెరీర్‌ వారు చూసుకుంటూ మీడియాకు దూరంగా ఉంటూ ఉంటారు. కానీ, మెగా డాటర్‌ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మాత్రం తరచూ సోషల్‌ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ప్రేమించుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత నిహారిక ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే చైతన్య కూడా తన పనిలో తాను బిజీగానే ఉంటున్నాడు. 

సోషల్‌ మీడియాలో తరచూ వీరిద్దరికి సంబంధించిన అప్‌డేట్స్‌ వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక చేసిన వ్యాఖ్యలు చక్కర్లు కొట్టాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందని, పిల్లల్ని కనాలని వుందని చెప్పింది. ఆమె చేసిన కామెంట్స్‌కి డైరెక్ట్‌గా కాకపోయినా ఇన్‌డైరెక్ట్‌గా చైతన్య తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఒకరి వాదననే ప్రచారం చేయడం కరెక్ట్‌ కాదని ఇన్‌డైరెక్ట్‌గా నిహారికకు కౌంటరు ఇచ్చాడు. సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని చైతన్య పెట్టిన పోస్ట్‌లో.. ‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలెన్స్‌.. ఇలా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని మీ నుంచి వేరు చేస్తుంది. మౌనం దేవుడితో కలిపే మాధ్యమం’ అని పోస్ట్‌ చేశాడు. అతను ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్‌ పెట్టాడో తెలీదుగానీ నెటిజన్లు మాత్రం దానికి స్పందిస్తున్నారు. అతని పోస్టుకు రకరకాల కామెంట్స్‌ పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. మరి దీనికి నిహారిక ఎలా స్పందిస్తుందో.. ఈసారి ఆమె ఏం పోస్ట్‌ పెడుతుందో చూడాలి. 



Source link

Related posts

ప్రమోషన్స్ లేకుంటే డ్యామేజే

Oknews

వెంకయ్యనాయుడుగారి మాటలను అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు! 

Oknews

మూడేళ్ళ తర్వాత మెగా ఫోన్‌ పట్టనున్న మురుగదాస్‌.. హీరో ఎవరో తెలుసా?

Oknews

Leave a Comment