Rashid Khan returns: క్రికెట్ అభిమానులకు బాగా దగ్గరైన విదేశీ క్రికెటర్లలో రషీద్ ఖాన్(Rashid Khan) కూడా ఒకరు. సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టులో కీలక ఆటగాడిగా కొంతకాలం కొనసాగాడు. తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు అతను గుజరాత్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఏ టీం కి మారినా తన ఆటతో మాత్రం క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవలే రషీద్ ఖాన్(Rashid Khan)కు వెన్నెముక సర్జరీ పూర్తయ్యింది. . ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్ సిరీస్‌లో సభ్యుడిగా ఉన్నా రషీద్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐర్లాండ్‌తో జరుగుతున్న టెస్టు, వన్డేలలో కూడా అతడు భాగస్వామి కాలేదు. కానీ ఐర్లాండ్‌తో మొదలుకాబోతున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా రషీద్ రీఎంట్రీ ఇచ్చాడు. రషీద్ మైదానంలో అడుగు పెట్టడంతో గుజరాత్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. తమ స్టార్ స్పిన్నర్ తిరిగి జట్టులోకి వస్తున్నాడని.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు తిప్పలే అని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రషీద్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. తనకు అత్యంత సంతోషాన్నిచ్చేది క్రికెట్ ఫీల్డ్‌లోకి దిగినప్పుడే. తనకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచినందరికీ కృతజ్ఞతలని రషీద్ అన్నాడు. ఈ వీడియో ద్వారా రషీద్ తాను పూర్తిగా కోలుకున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఇది గుజరాత్ టైటాన్స్ అభిమానులకు సంతోషాన్నిచ్చేదే..
అద్భుత బౌలర్
మన దేశంలో ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో రషీద్ అద్భుతంగా రాణించాడు. అఫ్గన్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఆడలేదు. ఈ నేపధ్యంలోనే మెగా టోర్నీ తర్వాత సర్జరీ చేయించుకుంటానని ప్రకటించాడు. దీంతో ఆసీస్‌లో జరుగుతున్న బిగ్‌బాష్‌లీగ్ 13వ సీజన్‌కు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 2024 జనవరిలో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ ఆడడం కూడా రషీద్‌కు కష్టమేనని తెలుస్తోంది. ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ పోరాటం అద్భుతంగా ముగిసింది. ఎటుచూసినా అంధకారమే ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన అఫ్గాన్.. అద్భుత ప్రదర్శన చేసింది అబ్బురపరిచింది.
మూడు ప్రపంచ ఛాంపియన్ జట్లను చిత్తు చేసి మరో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించినంత పని చేసింది. అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే అగ్ర జట్ల కూడా భయపడేలా… సమగ్ర వ్యూహంతో బరిలోకి దిగేలా చేసింది. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరేందుకు మిగిలిన నాలుగో బెర్తు కోసం చివరి క్షణం వరకు అఫ్గాన్ రేసులో నిలిచిందంటే అర్ధం చేసుకోవచ్చు. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు పోరాటం ఆకట్టుకుంది. ఒకప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటి బ్యాటింగ్‌లో చేతులెత్తేసి ఓటమి పాలవ్వడం అప్గాన్‌కు సాంప్రదాయంగా ఉండేది. కానీ ఈ వరల్డ్‌కప్‌లో అప్గాన్ బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. ప్రపంచకప్ చరిత్రలోనే ఓ అఫ్గాన్ బ్యాటర్ సెంచరీ చేసి సత్తా చాటాడు. అంతేనా ఈ పోరాటాలతో అఫ్గాన్ ఇక పసికూన జట్టు కాదని.. అగ్ర జట్టని మాజీ క్రికెటర్లు తీర్మానం చేసేశారు.
మరిన్ని చూడండి