Health Care

సార్వత్రిక యాంటీవీనమ్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. లైఫ్‌సేవర్‌గా మారుతున్న ఔషధం


దిశ, ఫీచర్స్ : విషం పేరు వినగానే చాలా మందికి శరీరంలో వణుకు పుడుతుంది. అయితే పెరుగుతున్న సాంకేతికతతో ఇప్పుడు అనేక రకాల విషానికి విరుగుడుగా యాంటీవీనమ్ ను కనుగొన్నారు. అయితే కొన్ని యాంటీ వీనమ్ లని ఉపయోగించే ముందు ఏ విషపు జీవి మిమ్మల్ని కరిచిందో గుర్తించడం అవసరం. కానీ చాలా మందికి ఏ జాతి పాము కరిచిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు తయారు చేసిన ఔషధం దాదాపు ప్రతివిషానికి విరుగుడుగా ఉంది. ఏదైనా విషపు ప్రాణి కాటు వేస్తే ఈ యాంటీవీనమ్ ని ప్రయోగిస్తే బాధితులను కాపాడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లోని నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు అటువంటి యాంటీవీనమ్‌ను ప్రయోగశాలలో తయారు చేశారు. ఇది తయారు చేయడం చాలా సులభం అయినా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది బాధితులని ఏదైనా విషం నుండి సులభంగా రక్షించగలదు. యాంటీవెనమ్‌లో గుర్రాలకు ఇచ్చే యాంటీ – టాక్సిన్ యాంటీబాడీస్ ఉంటాయి.

ఇదంతా ఎలా సాధ్యమైంది ?

వాస్తవానికి ఇది గుర్రాలలోకి చిన్న మొత్తంలో పాము విషాన్ని ఇంజెక్ట్ చేయడం, ప్రతిరోధకాలను సేకరించడం ద్వారా తయారు చేశారు. దీన్ని ఉపయోగిస్తే పాము కరిచినా వారి పై ఎలాంటి విష ప్రభావం ఉండదు. ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు దీనిని స్ఫూర్తిగా తీసుకుని, ప్రయోగశాలలో తయారు చేసిన ఈ యాంటీవీనమ్‌ను తయారు చేశారు.

మానవ రోగనిరోధక వ్యవస్థ ఎలాంటి విషంతో పోరాడటానికి పూర్తిగా సరిపోయే విధంగా తయారు చేసిన ప్రక్రియ. క్యాన్సర్ చికిత్సలో ఈ రకమైన ఔషధం ఉపయోగిస్తారు. ఇది దుష్ప్రభావాలను కలిగి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం ప్రయోగశాలలో తయారు చేసిన ఈ ఔషధానికి 95Mat5 అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ప్రచురితమైన వార్తల విషయానికోస్తే ఐదు బిలియన్ల యాంటీబాడీలను పరీక్షించి, న్యూరోటాక్సిన్‌ను తటస్థీకరించే ఔషధం తయారు చేశారు.



Source link

Related posts

అతిగా కూల్ డ్రింక్స్ ని తాగుతున్నారా.. అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

Oknews

‘మిలియనీర్ అవ్వండి, బిలియనీర్‌ని పెళ్లి చేసుకోండి’ పుట్టబోయే బిడ్డకు ఓ మహిళ విచిత్రమైన షరతు..

Oknews

అది ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం.. స్పెషాలిటీ ఏంటంటే..

Oknews

Leave a Comment