Latest NewsTelangana

telangana toss ssc inter open exam 2024 date sheet released check exams dates here | TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల


TOSS SSC, Inter Exams Schedule: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షల షెడ్యూలును అధికారులు మార్చి 16న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్ టేబుల్‌ను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు పరీక్షలకు వారం ముందునుంచి అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో పెడతారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 25.04.2024

ఉదయం సెషన్: తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి. 

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.

➥ 26.04.2024

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.

➥ 27.04.2024

ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.

మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.

➥ 29.04.2024

ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.

మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ 30.04.2024

ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.

➥ 01.05.2024

ఉదయం సెషన్: ఎకనామిక్స్.

మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.

➥ 02.05.2024

ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.

మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)

ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 25.04.2024

ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ. 

మధ్యాహ్నం సెషన్: అరబిక్.

➥ 26.04.2024

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.

➥ 27.04.2024

ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.

మధ్యాహ్నం సెషన్:  కెమిస్ట్రీ, పెయింటింగ్.

➥ 29.04.2024

ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.

➥ 30.04.2024

ఉదయం సెషన్:  హిస్టరీ. 

మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జియెగ్రఫీ.

➥ 01.05.2024

ఉదయం సెషన్: ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్.

మధ్యాహ్నం సెషన్: బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్.

➥ 02.05.2024

ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).

మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.

ప్రాక్టికల్ పరీక్షలు..

జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 03.05.2024 – 10.05.2024.

TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - టైమ్ టేబుల్ ఇదే!

ALSO READ:

ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల టైమ్‌టేబుల్ ఇలా 
ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు మార్చి 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల హాల్‌టికెట్లు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...



Source link

Related posts

మాసోడి ఊచకోత.. వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈగల్!

Oknews

Telangana Former Dy Cm Rajaiah May Quit Brs he joins to congress

Oknews

Vijay Devarakonda dance with Mrunal Thakur విజయ్ దేన్నీ వదలట్లేదు

Oknews

Leave a Comment