Latest NewsTelangana

telangana cm revanth reddy appointed 37 corporation chairmans | Corporations Chairmans: రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం


CM Revanth Appoint 37 Corporations Chairmans: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విడుదలైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఎంతగానో ఎదురుచూస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించారు. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న వారు, పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన వారిని పదవులకు సీఎం ఎంపిక చేశారు. ఈ పదవుల కోసం ఇప్పటికే చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో పని చేసేందుకు ఈ పదవుల భర్తీ ఉపకరిస్తుందని రేవంత్ భావిస్తున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు లోక్ సభ ఎన్నికల్లోనైనా తమకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. 

కార్పొరేషన్ చైర్మన్లు వీరే

 పటేల్ రమేష్​ రెడ్డి – టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్

నేరెళ్ల శారద – మహిళా కమిషన్

నూతి శ్రీకాంత్ గౌడ్ – బీసీ శ్రీకాంత్ గౌడ్

రాయల నాగేశ్వరరావు – గిడ్డంగుల సంస్థ

బండ్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి సంస్థ

ఎన్. ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్

శివసేనారెడ్డి – తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ

ఈరవత్రి అనిల్ – ఖనిజాభివృద్ధి సంస్థ

జగదీశ్వరరావు (కొల్లాపూర్) – ఇరిగేషన్ డెవలప్ మెంట్ సంస్థ

మెట్టు సాయికుమార్ – మత్స్య సహకార సంఘాల సమాఖ్య

గుర్నాథ్ రెడ్డి (కొడంగల్) – పోలీస్ గృహ నిర్మాణ సంస్థ

జ్ఞానేశ్వర్ ముదిరాజ్ – విజయా డెయిరీ

బెల్లయ్య నాయక్ – గిరిజన సహకార ఆర్థిక సంస్థ

జంగా రాఘవరెడ్డి – ఆయిల్ ఫెడ్

ఇనుగాల వెంకట్రామి రెడ్డి – కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ

రియాజ్ – గ్రంథాలయ పరిషత్

కాల్వ సుజాత – వైశ్య సంస్థ

కాసుల బాలరాజు (బాన్సువాడ) – ఆగ్రోస్

నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి) – పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

  ప్రకాష్​ రెడ్డి (భూపాలపల్లి) – రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్

ఎస్.అవినాష్ రెడ్డి – విత్తనాభివృద్ధి సంస్థ

ఎం.విజయబాబు – రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య

మానాల మోహన్ రెడ్డి – రాష్ట్ర సహకార యూనియన్

చల్లా నరసింహారెడ్డి – అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ

కె.నాగు – గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ

జనక్ ప్రసాద్ – కనీస వేతన సలహా మండలి

ఎం.వీరయ్య – వికలాంగుల సంస్థ

నాయుడు సత్యనారాయణ – హస్తకళల సంస్థ

ఎం.ఎ.జబ్బార్ – వైస్ ఛైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ

మల్ రెడ్డి రాంరెడ్డి – రోడ్డు అభివృద్ధి సంస్థ

పొదెం వీరయ్య – అటవీ అభివృద్ధి సంస్థ

కె.నరేందర్ రెడ్డి – శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ

పుంజాల అలేఖ్య – సంగీత నాటక అకాడమీ

ఎన్.గిరిధర్ రెడ్డి – ఫిలిం డెలవప్ మెంట్ సంస్థ

మన్నె సతీష్ కుమార్ – రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ

జె.జైపాల్ – అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ

ఎం.ఎ.పహీం – తెలంగాణ ఫుడ్స్
Corporations Chairmans: రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Also Read: Telangana Loksabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల – ఉఫ ఎన్నిక కూడా, ముఖ్యమైన తేదీలివే!

 

మరిన్ని చూడండి



Source link

Related posts

యాదాద్రి భక్తులకు శుభవార్త -ఇక కొండపై నిద్రించే సౌకర్యం, ఈ రోజు నుంచే అమలు..!-dormitory hall facilitation for the devotees on yadadri temple ,తెలంగాణ న్యూస్

Oknews

Lavnya జిమ్ లో మెగా చిన్నకోడలి విన్యాసాలు

Oknews

‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ ప్రభంజనం.. స్టార్ హీరో సినిమా రేంజ్ లో రెస్పాన్స్..!

Oknews

Leave a Comment