GossipsLatest News

సేవ్ ద టైగర్స్ సీజన్1 కూల్, సీజన్2 ఓకె ఓకే


ఓటీటీలు పాపులర్ అయ్యాక వెబ్ సీరీస్ లు చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకులు, నటులు సినిమాల కోసమే వెయిట్ చెయ్యకుండా వెబ్ సీరీస్ లు చేస్తూ బిజీగా వుంటున్నారు. అందులో క్రైం థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఓటీటీలలో బాగా హిట్ అవుతున్నాయి. గత ఏడాది మహి వి రాఘవన్ ప్రొడ్యూస్ చేసిన సేవ్ ద టైగర్స్ కామెడీ వెబ్ సిరీస్ గా ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. 

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ లు నటించి మూడు డిఫ్రెంట్ ఫ్యామిలిస్ తో సరదా సరదాగా ఈ సీరీస్ ని తెరకెక్కించగా.. ఈసీజన్ ఆడియన్స్ బాగా ఇంప్రెస్స్ అయ్యారు.

ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన సేవ్ ద టైగెర్స్ 2 నిన్న శుక్రవారం నుంచే డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ సీరీస్ సేవ్ ద టైగర్స్ కి కంటిన్యూగా వచ్చింది. కథలోకి వెళితే.. హీరోయిన్ హంసలేఖ(సీరత్ కపూర్) మర్డర్ కేసులో జైలుకెళ్లిన గంటా రవి(ప్రియ దర్శి), గౌతమ్ (అభినవ్ గోమఠం), విక్రమ్(చైతన్య కృష్ణ)లు పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ మర్డర్ అవలేదు, బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకుని వచ్చే సందర్భంగా గంటా రవి ఇంట్లో ఉంటుంది. రవి భార్య హైమావతి(జోర్దార్ సుజాతకి) తన ఫ్యామిలీ గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవ్వాలని భర్త రవిని సతాయిస్తుంది.

గౌతమ్ రైటర్ అయ్యేందుకు కుస్తీపడతాడు, విక్రమ్ ఆఫీసులో ప్రాజెక్ట్ విషయంలో సఫర్ అవుతూ ఉంటాడు. మూడూ డిఫ్రెంట్ కల్చర్ ఉన్న కుటుంబాలతో సేవ్ ద టైగర్స్ ని దర్శకుడు తేజ కాకుమాను మలిచాడు. ఫస్ట్ సీజన్ అంత గ్రిప్పింగ్ సెకండ్ సీజన్ లో లేకపోయింది. బోర్ కొట్టింది అని చెప్పలేం కానీ.. ఇంట్రెస్టింగ్ గా ఉన్న సన్నివేశాలు అంతగా లేకపోవడం ఓటీటీ ఆడియన్స్ ని నిరాశపరించింది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, పనిమనిషిగా చేసిన రోహిణి, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత.. ఇలా ఎవరికి వారే నటన పరంగా ద బెస్ట్ అనిపించారు. 

కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అవడం, అలాగే కొన్ని ఎపిసోడ్ లాగ్ ఉండడంతో సీజన్ 1 బెస్ట్.. సీజన్ ఓకె ఓకె అంటూ నెటిజెన్స్ సేవ్ ద టైగెర్స్ వీక్షించి కామెంట్స్ చేస్తున్నారు. 



Source link

Related posts

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు తేజ సజ్జ 

Oknews

Steps To Close Paytm FASTag and Shift To Another Bank FASTag

Oknews

సెన్సార్‌ నిర్ణయంతో యూత్‌కి నిరాశ తప్పదా?

Oknews

Leave a Comment