GossipsLatest News

మోదీ, బాబు, పవన్.. ముగ్గురిలో మెప్పించిందెవరు..?


మూడు ముక్కల్లో మోదీ, బాబు, పవన్ ప్రసంగం!

టీడీపీ-జనసేన-బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా గళం ఆశించిన రీతిలో జరగలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సభలో నిర్వాహణ లోపాలు, పోలీసులు సరైన భద్రత ఇవ్వలేకపోవడం.. ఇలా ఒకటా రెండా లెక్కలేనన్నే ఉన్నాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ప్రసంగాలు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అవన్నీ అటుంచితే.. సభలో ముగ్గురు మొనగాళ్లు ఏం మాట్లాడారనే విషయాలను మూడు ముక్కల్లో చూసేద్దాం రండి.. ఇంకెందుకు ఆలస్యం లుక్కేసేయండి.

ప్రధాని అంతంత మాత్రమే..!

ప్రధాని వస్తున్నారంటే జగన్ సర్కార్‌పై ఒంటి కాలిపై లేస్తారని.. ఈ ప్రసంగంతో కూటమిలో కొత్త జోష్ వస్తుందని భావించారు కానీ మోదీ పెద్దగా మాట్లాడలేదని అర్థం చేసుకోవచ్చు. తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభించడంతో సభికులంతా జోష్‌తో ఊగిపోయారు కానీ.. ఇదే పరిస్థితి ప్రసంగం పూర్తయ్యే వరకూ కొనసాగలేదు. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై అంతంత మాత్రంగానే విమర్శలు చేస్తూ వచ్చారు మోదీ. దీంతో వైసీపీ-బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని కొందరు విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని.. మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇక వైసీపీ-కాంగ్రెస్ రెండూ ఒక్కటే అని.. ఒకే కుటుంబ పార్టీలు అని మోదీ చెప్పుకొచ్చారు. ఎంతసేపూ కాంగ్రెస్‌ను విమర్శించడానికే ప్రధాని సమయం కేటాయించారు కానీ.. మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నప్పటికీ వాటి జోలికే వెళ్లలేదు. పోలవరం, రాజధాని ఇంకా వైసీపీ చేసిన విధ్వంసాలు ఎందుకో మోదీ నోట రాలేదు. పోనీ కూటమి అధికారంలోకి వస్తే తాము ఫలానా చేస్తామన్న హామీలు సైతం రాకపోవడం గమనార్హం. మొత్తం ప్రధాని ప్రసంగంలో అస్సలు పసే లేదన్నది ఇన్‌సైడ్‌గా నడుస్తున్న టాక్.

బాబు రొటీన్.. రొటీన్!

ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అని డైలాగ్ పేల్చారు. ఇక అంతే.. మోదీ భజన మొదలెట్టేశారు బాబు. మోదీ.. అంటే భవిష్యత్, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అంటూ షురూ చేసిన బాబు ఆ ప్రసంగం ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. అసలు కూటమికి ఎందుకు ఓట్లేయాలి..? ఎందుకు  కూటమిని ఆదరించి గెలిపించాలి..? ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది..? ఇక అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించనే లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్ రెడ్డి గురించి కూడా బాబు మాట్లాడింది అంతంత మాత్రమే. మోదీ మనతోనే ఉన్నారు.. అధికారంలోకి జగన్, వైసీపీ ప్రభుత్వం అవినీతిని అంతా బయటికీ తీస్తానన్న మాట బాబు నోటి నుంచి రాకపోవడం గమనార్హం. ఇంత ప్రతిష్టాత్మక సభలో మోదీ ముందు ఏం మాట్లాడితే తప్పేంటి..? ప్రధాని ఏమంటారు..? ఎందుకిలా చేశారో మరి. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ-వైసీపీ ఎప్పటికైనా ఒక్కటేనని, ప్రధాని ముందు ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్నట్లుగానే బాబు ప్రసంగం సాగింది. ఈ సభలో చేసిన ప్రసంగం కంటే మీడియా మీట్, రా కదలి రా సభల్లో అయినా నయం అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

పవన్ అంతే..!

ఇక ప్రజా గళం సభలో పవన్ ఒక్కడే తన ప్రంసగంతో మెప్పించాడని చెప్పుకోవచ్చు. వైఎస్ వివేకా మర్డర్ మొదలుకుని చంద్రబాబు అరెస్ట్, ప్రభుత్వం చర్యలను సేనాని కడిగిపారేశారు. వైఎస్ జగన్‌ను రావణుడితో.. ఇక ప్రధాని మోదీని రాముడితో  పోలుస్తూ మాట్లాడారు. అయోధ్యకు రాముడిని తెచ్చిన మోదీనే ఇక్కడ కూటమితో ఉన్నారని.. ఆయన ముందు చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత..? అని పవన్ పంచ్ డైలాగ్స్, పోలికలు, ప్రాసలతో స్పీచ్ ఇరగదీశారని చెప్పుకోవచ్చు. కష్టాల్లో ఉన్న ఏపీకి మోదీ అండగా ఉంటారని.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని మాటిచ్చారని ప్రధాని ఎదుటే పవన్ చెప్పేశారు. సేనాని ప్రసంగం జరిగింది కొంతసేపే అయినా ఆయన మాట్లాడుతున్నంత సేపు సభా ప్రాంగణం అంతా ఈలలు, కేకలు.. అరుపులు.. నినాదాలతోనే నడిచింది. దీంతో రెట్టింపు ఉత్సాహం పవన్ ప్రసంగించారు. మోదీ, చంద్రబాబుల కంటే తన ప్రసంగంతో పవన్ ఆకట్టుకున్నారని.. సభికులను మెప్పించారని చెప్పుకోవచ్చు. ఇక భారీ బహిరంగ సభ ముగిసిన తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభ నిర్వహణలో లోపాలు, పోలీసులతో తలెత్తిన ఇబ్బందుల గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. కూటమికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సపోర్టు ఉంటుందని ధైర్యంగా ముందుకెళ్లి గెలిచి రావాలని మోదీ హామీ ఇచ్చారట. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నింటినీ పవన్, చంద్రబాబు ఇద్దరూ మోదీకి పూసగుచ్చినట్లుగా వివరించినట్లుగా తెలుస్తోంది. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.



Source link

Related posts

‘పేక మేడలు’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల’ విడుదల!

Oknews

ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్!

Oknews

బీజేపీని వీడే ప్రసక్తే లేదన్న ఎంపీ సోయం బాపూరావు

Oknews

Leave a Comment