PM Modi Comments in Jaitial Meeting: పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్ఎస్ ఆడుకుందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. సోమవారం జగిత్యాలలో (Jagitial) జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఇతర కీలక నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి మద్దతు పెరిగిందన్న మోదీ.. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. ‘దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారత్ అభివృద్ధి చెందితేనే తెలంగాణలోనూ అభివృద్ధి జరుగుతుంది. బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణ అభివృద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం.’ అని మోదీ పేర్కొన్నారు.
Also Read: Danam Nagendar: దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ – స్పీకర్ కు సమర్పించిన బీఆర్ఎస్ నేతలు
మరిన్ని చూడండి