Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ… క్వీన్ ఆఫ్ ఉమెన్ క్రికెట్. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కలిసి గట్టిగా అనుకోవాలే కానీ ఆమెకు ఇప్పుడు గుడి కట్టేసినా ఆశ్చర్యం లేదు. ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలుచుకోవడం పెర్రీ అంత కీలకమైన రోల్ పోషించింది మరి. బ్యాట్ తో, బాల్ తో. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో బయటపడేసింది. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకుంది.
ఎన్నెన్నో ఘనతలు
ఎల్లీస్ పెర్రీ క్రికెటింగ్ కెరీర్….. WPL టైటిల్ విజయంతో మరింత సంపూర్ణమైంది. ఆమె కెరీర్ లో సాధించిన ఘనతలేంటో సింపుల్ గా చెప్పుకుందాం. ఆరుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్, రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఛాంపియన్, రెండుసార్లు బిగ్ బ్యాష్ లీగ్ విజేత, క్రికెటర్ ఆఫ్ ద డికేడ్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద డికేడ్, టీ20 క్రికెటర్ ఆఫ్ ద డికేడ్…. ఇవన్నీ ఆమె సొంతం. వీటిలో ఏదో ఒకటి ఒకసారి సాధిస్తేనే గొప్ప అనుకుంటాం. కానీ ఇవన్నీ ఆమె ఖాతాలో ఉండటం…. ఆమె ఎంతటి లెజెండరీ క్రికెటరో తెలియచేస్తోంది.
ఫుట్‌బాలర్‌గా కూాడా..
16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఆమెది. ఇంకా కొనసాగుతోంది. అయితే ఆమె కేవలం క్రికెటర్ అనుకుంటే పొరపాటే. ఆమె ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ కూడా. ఆస్ట్రేలియా తరఫున ఫిఫా మహిళల ఫుట్ బాల్ ప్రపంచకప్ లో పార్టిసిపేట్ చేసింది. నాకౌట్ మ్యాచెస్ లో గోల్ కూడా చేసింది. లెజెండరీ ఆటగాడైన క్రిస్టియానో రొనాల్డో కూడా ఇప్పటిదాకా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచెస్ లో గోల్ చేయలేదు. కంపేర్ చేయట్లేదు కానీ ఓ ఇంట్రెస్టింగ్ విషయం అంతే.
ఇప్పుడు డెడికేషన్ మొత్తం క్రికెట్‌పైనే
ఎల్లీస్ పెర్రీ…. కెరీర్ మొదట్లో క్రికెట్, ఫుట్ బాల్ రెండూ ఆడుతూ వచ్చేది. కానీ కొన్నేళ్ల తర్వాత ఫుట్ బాల్ అసోసియేషన్ వాళ్లు…. ఏదో ఒకదాంట్లోనే కొనసాగాలని చెప్పటంతో…. పెర్రీ ఇక తన టైం అంతా క్రికెట్ కే డెడికేట్ చేసింది. పెర్రీ క్రికెట్ కే కాదు… అందానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. చాలా మంది ఫ్యాన్స్ కు సెలెబ్రిటీ క్రష్ గా పెర్రీ ఉంటుంది. అందుకేగా… మొన్న ఆర్సీబీ రెట్రో నైట్ పార్టీలో పెర్రీ చీర కడితే… ఆ పిక్చర్స్ క్షణాల్లో వైరల్ అయిపోయాయి.
మరిన్ని చూడండి