Entertainment

ఓటీటీలోకి మరో హారర్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!



తెలుగులోకి ప్రతీ వారం ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అయితే కొందరు దర్శక, నిర్మాతలు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఓటీటీ వేదికపై వచ్చే సినిమాలు, సిరీస్ లు మంచి హైప్ తెచ్చుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం ఓటీటీలో ఆర్యన్ నటించిన ‘విలేజ్’ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ తెచ్చుకుంది. ది రైల్వే మ్యాన్, రానా నాయుడు, ఫర్జీ, భామా కలాపం, సేవ్ ది టైగర్స్, షైతాన్ లాంటి వెబ్ సిరీస్ లు ఓటీటీలో అదరహో అనిపించాయి. దీంతో కొన్ని సినిమాలని, సిరీస్ లని ఓటీటీ కోసమే దర్శకులు సిద్ధం చేస్తున్నారు. అలాంటి వాటిల్లో నవీన్ చంద్ర చేసిన సిరీస్ ‘ ఇన్ స్పెక్టర్ రిషి ‘. ‘నేను లోకల్ ‘ సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. అందాల రాక్షసి సినిమాలో నవీన్ చంద్ర నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత లచ్చిందేవికి ఓ లెక్కుంది లాంటి సినిమాలు తీసిన అవి పెద్దగా ఆడలేదు‌. దీంతో కొన్నిరోజులు గ్యాప్ తీసుకున్నాడు నవీన్ చంద్ర. ఇప్పుడు ‘ ఇన్ స్పెక్టర్ రిషి ‘ హారర్ థ్రిల్లర్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.

ఈ నెల 29 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వడానికి ఈ సిరీస్ సిద్ధంగా ఉన్నట్టు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగుతో పాటు మరో అయిదు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందంట. ఇందులో నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడంట. నందిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సునైనా, కన్నా రవి, మాలిని జీవరత్నం కీలకపాత్రల్లో నటించారు.   చట్టాలు అతీంద్రియ శక్తులకి అతీతం కాదు అనే క్యాప్షన్ పెట్టడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. మరి నవీన్ చంద్ర నటించిన ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉంటందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 



Source link

Related posts

ఆ రోజు ఫ్యాన్ గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను..ప్రేమలు హీరోయిన్

Oknews

ఇండస్ట్రీలో మరో రచ్చ.. రెండో పెళ్లికి రెడీ అయిన నటుడు.. అడిగితే కత్తితో దాడి!

Oknews

నా అభిమానుల  కోసమే ఈ నిర్ణయం  అంటున్న ఎన్టీఆర్ 

Oknews

Leave a Comment