Warangal Politics: పార్లమెంటు టికెట్ కేటాయింపుతో వరంగల్ బీఆర్ఎస్ లో అసమ్మతి రాజుకుంటుంది. వరంగల్ పార్లమెంట్ టిక్కెట్ ను మాజీ ఉమముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు కేటాయించింది అధిష్టానం. దీంతో గులాబీ పార్టీలో కావ్యను వ్యతిరేకించడంతోపాటు ఎట్టిపరిస్థితుల్లో మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.
వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలతో పాటు పార్టీలో కొనసాగుతున్న అప్పటి ఉద్యమకారులు పోటీపడ్డారు. అయితే అనేక పరిణామాల దృష్ట్యా వరంగల్ ఎంపీ టికెట్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కు టికెట్ ఇవ్వడం జరిగింది. కడియం కావ్యను ఆపార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. టికెట్ మార్పు జరగాలని పట్టుబడుతున్నట్టు సమాచారం.
ఎందరో ఆశావహులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నేతలు వరంగల్ పార్లమెంట్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పార్టీని వీడిన తాటికొండ రాజయ్య, రెండువేల క్రితం బిజెపిలో చేరిన ఆరూరు రమేష్, సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. వీరిద్దరితోపాటు బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అప్పటి తెలంగాణ ఉద్యమకారులు సైతం వరంగల్ ఎంపీ టికెట్ ఉద్యమకారులకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరడం జరిగింది. అయితే ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య పార్టీని వీడడంతో వారి స్థానంలో కడియం కావ్య కు టికెట్ కేటాయించింది అధిష్టానం.
దీంతో ఉద్యమకారులతోపాటు పార్టీ లోని నేతలు కావ్య అభ్యర్థిత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేకంగా సమావేశమై అధిష్టానంపై తమ నిరసనను వ్యక్తం చేయాలని నివసిస్తున్నారు. జిల్లా స్థాయి పార్టీ సమావేశాల్లో సైతం ఉద్యమకారులు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఖరాకండిగా కావ్య ను తప్పించాలని చెప్పినట్లు సమాచారం. టికెట్టు ఇస్తే మాదిగ లేదా మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి గాని మాదిగ ఉప కులానికి ఇవ్వడమేందని వారు ఆ సమావేశంలో ప్రశ్నించినట్టు తెలుస్తుంది.
కావ్య కు టికెట్ ఖరారు కావడంతో ఉద్యమకారులంతా సమావేశమై అధిష్టానంపై నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ లోపు కవిత అరెస్టు కావడంతో పెద్ద సారు బాధలో ఉన్నాడని వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఏది ఏమైనా కావ్యను మార్చకుంటే నిరసన తప్పదనే భావనను వ్యక్తం చేస్తున్నారు ఉద్యమకారులు. అయితే అసంతృప్తి నేతలను కావ్య ఆమె తండ్రి కడియం శ్రీహరి ఉజ్జగించి సమస్యను సద్దుమదిగేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
మరిన్ని చూడండి