EntertainmentLatest News

మహేష్, రాజమౌళి సినిమాలో విలన్ గా స్టార్ హీరో!


సౌత్ స్టార్స్, నార్త్ స్టార్స్ కలిసి స్క్రీన్ పంచుకోవడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నాం. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’లో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించాడు. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’లో కూడా సైఫ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి ‘వార్-2’లో స్క్రీన్ షేర్ చేసుకోనుండగా, ‘రామాయణ’లో రణబీర్ కపూర్, యశ్  కలిసి నటించనున్నారు. ఇలా ఎందరో సౌత్, నార్త్ స్టార్స్ కలిసి నటిస్తున్నారు. త్వరలో మరో సెన్సషనల్ కాంబినేషన్ కూడా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచస్థాయిలో సత్తా చాటిన ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందనుంది. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా బిగ్ స్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి సినిమాల్లో విలన్ రోల్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయి. ఈ మూవీలో విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందట. హీరో, విలన్ రోల్స్ నువ్వానేనా అని పోటాపోటీగా తలపడేలా ఉంటాయట. అందుకే విలన్ రోల్ కోసం బిగ్ స్టార్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నారట. ఈ క్రమంలో రాజమౌళి దృష్టి హృతిక్ రోషన్ పై పడినట్లు సమాచారం. ఇప్పటికే హృతిక్ కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ పోషించి అదరగొట్టాడు. పైగా రాజమౌళి సినిమా అంటే ఏమాత్రం వెనకాడకుండా హృతిక్ అంగీకరించే అవకాశముంది.

హృతిక్ విలన్ గా చేయడానికి అంగీకరిస్తే ఒక్కసారిగా ‘SSMB 29’ ప్రాజెక్ట్ క్రేజ్ మరో స్థాయికి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే హృతిక్ లాంటి స్టార్ తోడైతే నార్త్ లో ఖచ్చితంగా రికార్డు కలెక్షన్స్ వస్తాయి. మరోవైపు హృతిక్ కూడా తన మార్కెట్ ని పెంచుకోవచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ తో స్క్రీన్ చేసుకుంటున్న హృతిక్.. మహేష్ తో కూడా కలిసి నటిస్తే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడు. అలాగే SSMB 29’తో గ్లోబల్ లెవెల్ లోనూ అతని క్రేజ్ ఎంతో పెరుగుతుంది.



Source link

Related posts

బాలీవుడ్‌లో అయితే బట్టలిప్పేసి.. నా పేరుతో వ్యాపారం చేసేవారేమో!

Oknews

మంచు మనోజ్ భార్య డెలివరీ..నిక్ నేమ్ పెట్టామని మంచు లక్ష్మి ట్వీట్

Oknews

దుబాయ్‌లో మల్లారెడ్డి ఎంజాయ్..!

Oknews

Leave a Comment