EntertainmentLatest News

మార్చి 29న ‘తలకోన’ విడుదల


అక్షర క్రియేషన్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంద్భంగా చిత్ర  నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. “క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విధంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. అంతే కాకుండా ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. అందుకు తగ్గ టీమ్ ను సినిమాకు తీసుకోవడం జరిగింది.  అలాగే థ్రిల్లింగ్ సస్పెన్స్ తో మార్చి  29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు . 

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ.. “అప్సర రాణీ నటించిన వెరైటీ స్టోరీ ఇది. షూటింగ్ తలకోనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, విజయ కరణ్,  రంగ రాజన్, రాజా రాయ్  యోగి కంత్రి తదితరులు నటించిన ఈ  చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.



Source link

Related posts

Hyderabad Nampalli Court dismissed six out of eight cases today in tollywood drugs case

Oknews

గంగమ్మ లుక్ ఓ రేంజ్ లో ఉంది!

Oknews

Viral: Allu Arjun-Atlee Combo Fix? వైరల్: అల్లు అర్జున్-అట్లీ కాంబో ఫిక్స్?

Oknews

Leave a Comment