GossipsLatest News

Rajesh Mahasena Angry On Attitude of Janasena Leaders టార్చర్ భరించలేను: మహాసేన రాజేశ్



Mon 18th Mar 2024 07:42 PM

rajesh mahasena  టార్చర్ భరించలేను: మహాసేన రాజేశ్


Rajesh Mahasena Angry On Attitude of Janasena Leaders టార్చర్ భరించలేను: మహాసేన రాజేశ్

జనసేన టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం అటు జనసేన వాళ్ళకి ఇటు టీడీపీ వాళ్లకి చాలామందికి నచ్చడం లేదు. సీట్ల పంపకంలో సర్దుబాటు చేసుకోవడం అనేది చాలామందికి ఈ పొత్తు మేటర్ ఇమడలేదు. ఇక జనసేన-టీడీపీ కలయికలో సీట్ల ప్రకటన సోషల్ మీడియాలో ప్రకంపనలే సృష్టించింది. అందులో ముఖ్యంగా టీడీపీ నుంచి పి గన్నవరం సీటుని మహాజన రాజేష్ కి కేటాయించడంపై జనసేన నుంచి నిరసన వ్యక్తమైంది. కులం పేరుతో కొంతమంది రాజేష్ ని దూషిస్తూ, చంద్రబాబుని తిట్టిపోశారు. 

జనసేన కార్యకర్తలు మహాజన రాజేష్ ని తీవ్రంగా విమర్శించారు, నిరసించారు. ఇప్పడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడ్డాక సీట్ల ప్రకటనలో గందరగోళం నడుస్తుంది. ఇక పి గన్నవరం సీటు ముందుగానే మహాజన రాజేష్ కి కేటాయించారు చంద్రబాబు.  అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ, జనసేన నేతలు ఆయన ఎమ్మెల్యే పోటీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పోటీ నుంచి తప్పుకుంటానని కూడా మహాసేన రాజేష్ ప్రకటించారు. తాజాగా జనసేన వాళ్లు నన్ను అవమానిస్తున్నారు అంటూ మహాసేన రాజేశ్ ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి టార్చర్ భరించలేకపోతున్నా, నాకు చెప్పకుండా జనసేన నేతలు IVRS కాల్స్ చేస్తున్నారట. చంద్ర‌బాబు నాయుడు గారు న‌న్ను పిలిచి.. ఒరేయ్ రాజేశ్ నువ్వు పోటీ నుంచి త‌ప్పుకో.. నీకు వేరే అవ‌కాశం ఇస్తాను. నువ్వెప్పుడూ ప‌ద‌వి కావాల‌ని అడ‌గ‌లేదు క‌దా అని పిలిచి చెప్పేవ‌ర‌కు ఓపిక పట్టండి. 

నాకు టికెట్ ప్ర‌క‌టించ‌నంత వ‌ర‌కు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు ఈ టార్చ‌ర్ ఏంటి చంద్ర‌బాబు గారూ..! నన్ను జ‌న‌సేన అవ‌మానిస్తున్న‌ట్లే అనిపిస్తోంది. జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లతో సర్వే చేస్తున్నారని తెలిసింది. ఇది నాకు అవమానంగా ఉందని పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


Rajesh Mahasena Angry On Attitude of Janasena Leaders:

Rajesh Mahasena Fires on Janasena









Source link

Related posts

Interesting news on Megastar Vishwambhara మెగాస్టార్ విశ్వంభరపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Oknews

శశిమధనం వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

RK Roja Reaction On Her Defeat In AP Elections మేమెలా ఓడిపోయామో అర్ధం కావట్లా: రోజా

Oknews

Leave a Comment