EntertainmentLatest News

ఐదు భాషల్లో విడుదలైన లక్ష్మీ మంచు ‘ఆదిపర్వం’ ట్రైలర్‌!


లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మూవీ ’ఆదిపర్వం’. ఈ చిత్రానికి సంజీవ్‌ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్‌, ఎ.ఐ ఎంటరటైననమెంటన్స సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్‌ విడుదల చేశారు. 

తెలంగాణ ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ ఎన్‌. గిరిధర్‌ చేతుల మీదుగా ఆదిపర్వం తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుధ్‌ రెడ్డి తమిళ ట్రైలర్‌, ప్రముఖ దర్శకులు నీలకంఠ కన్నడ ట్రైలర్‌, ప్రముఖ రియల్టర్‌ శిల్పా ప్రతాప్‌ రెడ్డి మలయాళ ట్రైలర్‌, చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వరరావు హిందీ ట్రైలర్‌ విడుదల చేశారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, బిల్డర్‌ కైపా ప్రతాప్‌ రెడ్డి, నటీనటులు ఢల్లీి రాజేశ్వరి, సత్య ప్రకాష్‌, శివ కంఠమనేని, వెంకట్‌ కిరణ్‌, జెమినీ సురేష్‌, ఆదిత్య ఓం, శ్రీజిత ఘోష్‌, సీనియర్‌ జర్నలిస్టులు ప్రభు, ఆర్‌.డి.ఎస్‌ ప్రకాష్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.ఎస్‌. హరీష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

లక్ష్మీ మంచు మాట్లాడుతూ… ‘నాకు సంజీవ్‌గారు కథ చెప్పినప్పుడు ఇంత పెద్ద సినిమా తక్కువ సమయంలో ఎలా చేస్తారని అనుకున్నా. పోస్టర్‌ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్లు చేశానా అనిపిస్తుంది. నవ రసాలు, అన్ని రకాల ఎమోషన్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు. 

దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ… ‘మంచు లక్ష్మీగారి ద్వారా మీరు స్టార్‌ డైరెక్టర్‌ కాబోతున్నారు అని ‘ఆదిపర్వం’ పోస్టర్‌ చూసి చాలామంది చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అవార్డు వచ్చినంత ఆనందం వేసింది. ఈ మూవీలో మంచు లక్ష్మీగారి విశ్వరూపం చూస్తాం. ఆదిత్య ఓం కొత్త పాత్రలో కనిపిస్తారు. లక్ష్మీ మంచు భర్త పాత్రలో జెమిని సురేష్‌ చక్కని నటన కనబరిచారు. ఈ సినిమాలో సుమారు 400 మంది నటించారు. ఈ సినిమాకు బలం, బలగం మంచు లక్ష్మీ గారు. దాదాపు ఏడు గెటప్స్‌ వేశారు. దాదాపు 50 అడుగుల ఎత్తులో ఫైట్స్‌ చేశారు. ఆవిడ లేకపోతే ఈ మూవీ లేదు’ అని అన్నారు.

సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ప్రభు మాట్లాడుతూ… ‘ఆదిపర్వం’ ట్రైలర్స్‌ అదిరిపోయాయి. ఈ సినిమా ఈ రేంజ్‌ లో వస్తుందని నేను ఊహించలేదు. మంచు లక్ష్మి కెరీర్‌ లో ఈ చిత్రం ఒక మైల్‌ స్టోన్‌ అవుతుందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాబోదు’ అన్నారు.



Source link

Related posts

Grand Welcome to Esha Singh : బంగారుపతకంతో మెరిసిన ఈషాకు భాగ్యనగరం గ్రాండ్ వెల్కమ్ | ABP Desam

Oknews

కీర్తి సురేష్ ని బ్యూటీ అంటున్న రాశి ఖన్నా

Oknews

CCTV cameras in Anganwadi centres Soon Telangana CM Revanth Reddy

Oknews

Leave a Comment