Judge hearing Delhi excise policy case transferred: న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారిస్తున్న జడ్జి జస్టిస్ నాగ్ పాల్ స్థానంలో జడ్జి జస్టిస్ కావేరీ బవేజా నియమితులయ్యారు. ఢిల్లీ జ్యుడిషియల్ పరిధిలోని మరో 26 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.
మరిన్ని చూడండి