Royal Challengers Bengaluru: బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారీ క్రేజ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఇటీవల డబ్ల్యూపీఎల్ 2 సీజన్ టైటిల్ ను ఆర్సీబీ మహిళల టీమ్ నెగ్గింది. దాంతో ఈసారి డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ మెన్స్ టీమ్ కప్పు కొట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆర్సీబీ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. Royal Challengers Bangalore గా ఉన్న ఫ్రాంచైజీ పేరును Royal Challengers Bengaluruగా మార్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ఎక్స్ పేజీలో షేర్ చేశారు.

The City we love, the Heritage we embrace, and this is the time for our ಹೊಸ ಅಧ್ಯಾಯ.

PRESENTING TO YOU, ROYAL CHALLENGERS BENGALURU, ನಿಮ್ಮ ತಂಡ, ನಿಮ್ಮ RCB!#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox pic.twitter.com/harurFXclC

— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2024

ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం (మార్చి 19న) ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమం నిర్వహించారు. 2014లో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు. సిటీ పేరు అధికారికంగా మారిపోయినా ఆర్సీబీ జట్టును రాయల్ ఛాలెంజర్స్ Bangaloreగా వ్యవహరిస్తున్నారు. దాంతో కర్ణాటక వ్యాప్తంగా ప్రజలు బెంగళూరు (Bengaluru)గా మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇన్ని రోజులకు అది కార్యరూపం దాల్చింది.

కొత్త లోగో, కొత్త జెర్సీ లాంచ్
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ కోహ్లీ, ఆర్సీబీ మహిళల టీమ్ కెప్టెన్ స్మృతీ మందాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్సీబీ కొత్త శకం మొదలైందని, ఇక నుంచి తమకు అన్నీ విజయాలేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆర్సీబీ లోగోతో పాటు కొత్త జెర్సీని ఆర్సీబీ ఫ్రాంచైజీ విడుదల చేసింది.

లోగో, జెర్సీ ఆవిష్కరించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.. డీజే అలన్ వాకర్‌గా తమ కొత్త జెర్సీ అందజేశాడు. మహిళా టీమ్ కెప్టెన్ స్మృతి మందాన కొత్త జెర్సీని అశ్వినీ పునిత్ రాజ్ కుమార్‌కు అందజేసింది. ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి గతేడాది క్రిస్ గేల్, డివిలియర్స్ లకు చోటు దక్కింది. ఈ ఏడాది కర్ణాటకకు చెందిన భారత మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్ ను ఆర్సీబీ ఆల్ ఆఫ్ ఫేమ్ 2024గా ప్రకటించారు. మార్చి 22న తొలి మ్యాచ్ లోనే సొంత వేదిక చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆర్సీబీ తలపడనుంది.

ನಮ್ಮ ದಾವಣಗೆರೆ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್! 🫶

Formidable cricketer ✅
Our third highest wicket-taker ✅

We’re celebrating Namma Vinay Kumar as we engrave his name on the elite list. – 𝐑𝐂𝐁 𝐇𝐚𝐥𝐥 𝐨𝐟 𝐅𝐚𝐦𝐞 🤩#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox pic.twitter.com/f1j5QgfgSz

— Royal Challengers Bangalore (@RCBTweets) March 19, 2024

ఈ నెల ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫ్రాంచైజీ కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాల ద్వారా పేరు మార్పు గురించి ప్రచారం చేయిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి, అశ్విని పునీత్ రాజ్‌కుమార్, రష్మిక మంధాన, డానిష్ సైత్ లాంటి సెలబ్రిటీలు ‘మీకు అర్థమైందా?’ అంటూ వీడియో క్లిప్ లు షేర్ చేశారు.

Source link