Health Care

ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయను తింటున్నారా.. తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు


దిశ, ఫీచర్స్: వేసవి కాలం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే విపరీతంగా చెమటలు పడుతున్నాయి. మన శరీరం నుండి పోషకాలను కోల్పోవడం వల్ల ఇది సంభవిస్తుంది. కానీ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా మంది పుచ్చకాయలను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి, ఈ పండు తినడం వల్ల మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతినిస్తుంది.

పుచ్చకాయ వేసవిలో ఎండ వేడిమి నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. దీనిలో 92% నీరు కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా, పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. డైటింగ్ చేసేవారికి కూడా పుచ్చకాయ చాలా మంచిది. కానీ కొందరు మాత్రం పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తింటారు. అయితే, ఇలా చేయడం వల్ల పోషక విలువలు తగ్గుతాయి.

సాధారణంగా కొంతమంది మార్కెట్ నుంచి తీసుకురాగానే పండ్లను ఫ్రిజ్ లో నిల్వ చేసి రెండు, మూడు రోజుల తర్వాత తింటుంటారు. మరి కొందరు పుచ్చకాయను సగం కోసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ ఇది మంచిది కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేస్తే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. 



Source link

Related posts

రాంలాల్లా విగ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంటుంది.. నల్లని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ?

Oknews

టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తున్న పెరుగు..

Oknews

డిగ్రీ కన్నా స్కిల్స్ ముఖ్యం.. రిక్రూట్‌‌‌మెంట్ ప్రాసెస్‌లో నయా ట్రెండ్ !

Oknews

Leave a Comment