EntertainmentLatest News

పొలిటికల్ పార్టీ మీటింగ్ లో రామ్ చరణ్..ఫ్యాన్స్ అసహనం


వామ్మో ఇవేం లీకులండి బాబు..ఒక లీక్ బయటకి రావడమే తప్పు.అలాంటింది లీకుల మీద లీకులు. ఈ  లీక్ ల గోలేంటి  అనుకుంటున్నారా! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రెస్టేజియస్ట్ మూవీ  గేమ్ చేంజర్ కి ఇప్పుడప్పుడే లీక్ ల బెడద తప్పేలా లేదు. పైగా ఇప్పటి దాకా వచ్చిన  లీకులు ఒక ఎత్తు ఈ ఒక్క లీకే ఇంకో ఎత్తులా ఉంది.

గేమ్ చేంజర్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. కథ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని అక్కడ   చిత్రీకరిస్తున్నారు. ఇప్పడు ఆ షూట్ ఫేస్ బుక్ లో దర్శనం ఇస్తుంది. రామ్ చరణ్ తో పాటు ఎస్ జె సూర్య ఇంకో ప్రముఖ నటుడు అందులో పాల్గొన్నారు. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మీటింగ్ ని తెరకెక్కిస్తున్నారనే విషయం క్లియర్ గా  అర్ధం అవుతుంది. పెద్ద పెద్ద కట్ అవుట్ లు కూడా కనపడుతున్నాయి.ఆలాగే  వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. టోటల్ గా 33 సెకెన్ల నిడివి ఉన్న ఆ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇక చరణ్ లుక్  అయితే  అదిరిపోయింది.నీట్ గా ఇన్ షర్ట్ చేసుకొని ఒక పెద్ద ఆఫీసర్ లా ఉన్నాడు. ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి లీక్ లని అరికట్టాలని అంటున్నారు. అయితే గతంలో కూడా మూవీకి సంబంధించిన  చాలా స్టిల్స్ లీక్ అయ్యాయి.

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో చరణ్ తో  కియారా అద్వానీ జోడి కడుతుంది. ఇంతకు ముందు వీళ్లిద్దరు  వినయ విధేయ రామలో కలిసి  నటించారు. చరణ్ పుట్టిన రోజైన  మార్చి 27 న  విడుదలకి సంబంధించిన అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్న గేమ్ చేంజర్ రెండు సంవత్సరాల పై నుంచే షూటింగ్ దశలో ఉంది. చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా  ఉంది. సీతమ్మ  వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్  అంజలి మరో  కథానాయికగా చేస్తుంది.


 



Source link

Related posts

చిరు ఆఫర్ ని రెండుసార్లు మిస్ చేసుకున్న హీరో

Oknews

Pawan Kalyan Strong Warning To CM Jagan జగన్ కి గట్టిగా ఇచ్చేస్తున్న పవన్ ఫాన్స్

Oknews

Manchu Manoj – Mounika become proud parents గుడ్ న్యూస్ చెప్పిన మనోజ్ మరియు మౌనిక

Oknews

Leave a Comment