R Ashwin praises Guntur Kaaram: మహేశ్‌బాబు (Mahesh Babu) నటించిన ‘గుంటూరు కారం’(Guntur Kaaram)పై ప్రశంసల వర్షం కురిపించారు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin). సినిమా గురించి, అందులోని డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు. ప్రధాన నటీనటుల డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయానన్నారు.
గుంటూరు కారం సినిమా గురించి అశ్విన్ మాట్లాడుతూ సినిమాను ఆకాశానికెత్తేశారు. ఓ వీడియో కాల్‌లో తన మిత్రునితో అశ్విన్ మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా చూశారా అని అడగగా నేను చూడలేదని, నాకు సమయం ఉండదని, కేవలం రజనీకాంత్ సినిమాలు మాత్రమే చూస్తానని అతను జవాబిచ్చాడు. దీంతో అశ్విన్ తప్పనిసనరిగా గుంటూరు కారం చిత్రాన్ని చూడాలని కోరారు. అంతే కాదు యూ ట్యూబ్‌లో గుంటూరు కారం, శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ అని టైపు చేస్తే వచ్చే పాట చూస్తే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని, మీ పేవరేట్ లిస్టులో మహేశ్‌బాబుతప్పక యాడ్ అవుతాడని అతనికి సూచించారు. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)లో తొలి మ్యాచ్‌లోనే కొదమ సింహాల పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్ కోసం ఐపీఎల్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో విండో ఓపెన్ కాగానే క్షణాల్లో అయిపోయాయి. దీంతో చాలా మంది ఫ్యాన్స్ టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(R.Aswin) సైతం ఈ జాబితాలో చేరిపోయాడు. తొలి మ్యాచ్ చూసేందుకు తన కుమార్తెలు ఆశపడుతున్నారని.. మ్యాచ్ టికెట్లు ఇప్పించాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీని కోరాడు. ప్లీజ్ చెన్నై సూపర్ కింగ్స్.. వాళ్లకు హెల్ప్ చేయండి” అని రవిచంద్రన్ అశ్విన్ తన పాత జట్టును కోరాడు.
క్రికెట్ మేధావి అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఓ క్రికెట్ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్ ద్రావిడ్ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు. జట్టు కోసం ఏ త్యాగానికైనా.. ఎంతటి కష్టానికైనా అశ్విన్ సిద్ధంగా ఉంటాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్లను కకావికలం చేసి టీమిండియాకు విజయం సాధించిపెట్టగల ధీరుడు. జట్టుకు వికెట్ అవసరమైన ప్రతీసారి కెప్టెన్ చూపు అశ్విన్ వైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానంలోనూ అశ్విన్ అగ్రెసివ్‌గానే ఉంటాడు. మన్కడింగ్ ద్వారా బ్యాటర్‌ను అవుట్ చేసి… అది తప్పైతే నిబంధనల పుస్తకంలో ఎందుకు ఉందంటూ ధైర్యంగా అడిగే క్రికెటర్ అశ్విన్. అందుకే అంతర్జాకీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 12 ఏళ్లు దాటినా ఈ స్పిన్ మాంత్రికుడు.. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను వణికిస్తూనే ఉన్నాడు.
మరిన్ని చూడండి