Entertainment

సైలెంట్ గా వైఎస్ వివేకా బయోపిక్ పూర్తి.. రాజకీయ ప్రకంపనలేనా!


ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించింది. మొదట ఇది గుండెపోటుగా ప్రచారం పొందింది. ఆ తర్వాత ఆయనను గొడ్డలితో దారుణంగా హత్య చేశారనే విషయం బయటపడింది. అయితే ఈ దారుణ హత్య వెనుక అయినవాళ్లే ఉన్నారంటూ వివేకా కుమార్తె సునీత చాలారోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఈ క్రమంలో వైఎస్ వివేకా బయోపిక్ తెరమీదకు రావడం సంచలనంగా మారింది.

‘వివేకం’ పేరుతో వైఎస్ వివేకా బయోపిక్ రూపొందింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరనే విషయం రివీల్ కాలేదు కానీ.. ‘వివేకా బయోపిక్’ అనే యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు తర్వాత జరిగిన సంఘటనలను చూపిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. అంతేకాదు ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడంలేదు. ‘www.vivekabiopic.com’ అనే వెబ్ సైట్ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఎన్నికలకు ముందు ఈ బయోపిక్ ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.



Source link

Related posts

చిరంజీవికి కోపం తెప్పించిన వరుణ్ తేజ్!

Oknews

ప్రభాస్ ఫ్యాన్స్ డల్.. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా

Oknews

ప్రభాస్ కల్కి మీద నీకు ఎందుకు కుళ్ళు చిట్టి.. పవన్, బాలయ్య ఫ్యాన్స్  ఏకం  

Oknews

Leave a Comment