Health Care

ఆవు పాలతో ఇన్సులిన్.. అధ్యయనాల్లో కొత్త విషయాలు


దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో ఆవును లక్ష్మీ దేవిగా భావించి పూజలు చేస్తుంటారు. ఎంతో పవిత్రమైన ఆవు పాల నుంచి వచ్చే ఉత్పత్తులకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు ఎంతో పవిత్రమైనదని నమ్ముతారు. ఇంతటి పవిత్రమైన ఆవుపాల పై చేసిన పరిశోధనల్లో వెలువడిన కొన్ని విషయాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆవుపాలు ప్రపంచంలో ఏర్పడిన ఇన్సులిన్ కొరతను పరిష్కరిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడించారు. స్వచ్చమైన ఆవుపాలలో ఇన్సులిన్‌ తయారీకి అవసరమైన ప్రొటీన్‌లు ఉత్పత్తి చేయగల శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1921 వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఇన్సులిన్ ను కనుగొన్నారు. ఈ ఇన్సులిన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముఖ్యమైన ఔషధం. అప్పటి కాలంలో పంది, ఇతర జంతువుల ప్యాంక్రియాస్ నుంచి తీసకున్న ఇన్సులిన్‌తో చికిత్స అందించేవారు. కాగా 1978వ సంవత్సరంలో మొదటిసారిగా E కోలి బ్యాక్టీరియా నుంచి ప్రొటీన్లను తీసుకుని ఇన్సులిన్ ను ఉత్పత్తి చేశారు.

అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడే ఇన్సులిన్ సప్లిమెంటేషన్ కోసం ఆవులను అధ్యయనం చేయడం ఇది మొదటిసారి మాత్రం కాదు. ఇంతకు ముందు కూడా ఇన్సులిన్‌కు అవసరమైన ప్రోటీన్ లు ఆవుపాలలో ఉన్నాయని తెలిసి అధ్యయనాలు చేశారు.

చికాగోలో ఉన్న యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా – ఛాంపెయిన్‌లోని జంతు శాస్త్రవేత్త నిపుణుల నేతృత్వంలోని పరిశోధనా బృందాలు పరిశోధనలు చేశాయి. ప్రో-ఇన్సులిన్ కోసం కోడ్ చేసే మానవ DNAను 10 ఆవు పిండాల కణ కేంద్రకంలోని నిర్దిష్ట భాగాన్ని చొప్పించారు. అలాగే దాన్ని సాధారణ ఆవుల గర్భాశయంలోకి చొప్పిస్తారు. దీంతో ఆ ఆవుకి జన్యుమార్పిడితో దూడ జన్మిస్తుంది. అయితే ఈ విధంగా ఆవును గర్భవతిని చేసే ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. దాని తరువాత సావో పాలో విశ్వవిద్యాలయంలోని ఓ జంతువుల పెంపకం సాంకేతిక నిపుణుడు ఇలాంటి ప్రయత్నం చేసి విజయం సాధించారు. హార్మోనల్ ఇండక్షన్ పద్ధతితో ఆవుకు గర్భం తెచ్చి దాని నుండి పాలను ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుందని నిరూపించారు. ఆవుపాలలో ప్రొటీన్లు అత్యధికంగా ఉండాలంటే అది గర్భవతి అయి ఉండాలని తెలిపారు.

ఎలుకలపై ప్రయోగాలు..

ఆవు పాలలో మాత్రమే కాక ఎలుక పాలలోనూ ప్రో-ఇన్సులిన్ ఉంటుందని పరిశోధనల్లో గుర్తించారు. 2014 వ సంవత్సరంలో ఈ విషయం ఓ అధ్యయనంలో వెలువడింది. 8.1 గ్రాముల మానవ ప్రో-ఇన్సులిన్ ఒక లీటరు ఎలుక పాలలో ఉన్నట్లు వివరించారు. అయితే పోల్చదగిన సాంద్రతలను ఈ అధ్యయనంలో నివేదించలేదు.

ఒక్కో ఆవు లీటరు పాలలో ఒక గ్రాము ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తే మొత్తంగా 28,818 యూనిట్ల ఇన్సులిన్ విడుదల అవుతుంది. అయితే ఇన్సులిన్ సాధారణ యూనిట్ 0.0347 మిల్లీగ్రాములు. ఇక మాట్ వీలర్ అభిప్రాయం ప్రకారం 100 కంటే ఎక్కువ ఆవుల మంద ప్రపంచానికి కావలసనినంత ఇన్సులిన్‌ను సరఫరా చేయగలదని అంటున్నారు.



Source link

Related posts

బ్రేకప్ ..ఈ బాధ ఎవరిలో ఎక్కువగా ఉంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Oknews

అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్న ప్రజలు.. అన్నీ సమాధులు.. అస్థి పంజరాలే..

Oknews

ఇటు తల్లి.. అటు మామ, కూతురు,భర్త.. అందరి మధ్యలో నలిగిపోతున్న మహిళ

Oknews

Leave a Comment