Health Care

శరీరంలోని ఈ భాగాల్లో వాపు వస్తుందా.. పక్కా బాడీలో ఆ పార్ట్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..


దిశ, ఫీచర్స్ : మానవ శరీరం ఎన్నో అవయవాలతో నిర్మితమై ఉంటుంది. శరీరంలో లోపల ఉండే అవయవాల్లో కాలేయం, గుండె, ఊపిరితిత్తులు ఎంతో ముఖ్యమైనవి. వీటిలో ఏ ఒక్క అవయవం పనితీరు సరిగ్గా లేకపోయినా ఆరోగ్యం చెడిపోతుంది. ముఖ్యంగా కాలేయం పనితీరు కుంటుపడితే శరీరం చతికెలపడిపోయనట్టే. శరీరంలో ఉండే వ్యర్థాన్ని, విషాన్ని కాలేయం తొలగిస్తుంది. అంతే కాదు శరీరానికి అవసరమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి ఎంతో మేలు చేసే కాలేయం దెబ్బతింటే ఫ్యాటీ లివర్ అనే వ్యాధి బారిణ పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానవ శరీరంలో ఉండే కాలేయం ఫ్యాటీలివర్ సమస్యను ఎదుర్కొంటే దాని ప్రభావం ఇతర శరీర భాగాల పై పడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరి ఏయే శరీర భాగాల పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీలివర్ వ్యాధి అంటే ఏమిటి ?

ప్రపంచంలోని చాలామంది ప్రజలు ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతుంటారు. కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ అనే వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణం ఏంటి ?

అదనపు కొవ్వు కాలేయంలోకి చేరినప్పుడు ఫ్యాటీ లివర్ వ్యాధి సంక్రమిస్తుంది. ఒక్క కారణం అని కాకుండా అనేక కారణాల వలన ఈ వ్యాధి సంభవించవచ్చు. వాటిలో ముఖ్యంగా అధిక ఆల్కహాల్ తీసుకోవడం, అధిక కొలెస్ట్రాల్, ఫ్రై ఆహారాలు తీసుకోవడం, స్థూలకాయం వంటి వాటి వలన సంభవిస్తాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల కారణంగా అదనపు కొవ్వు కాలేయంలో చేరుకుని తీవ్రమైన మంట కలుగుతుంది. ఈ డిసీజ్ కారణంగా శరీరంలోని ఏ భాగాల్లో మంటలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖం వాపు

కళ్ళు, బుగ్గల చుట్టూ వాపు కలిగి ముఖం ఉబ్బుతుంది. ఈ వాపులు ఫ్యాటీ లివర్ కారణంగా రావచ్చని నిపుణుల అభిప్రాయం. ముఖం మీద వచ్చే వాపును ఫేషియల్ ఎడెమా అని పిలుస్తారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

చేతులు వాపు

చేతులు, చేతి వేళ్లలో వాపు కనిపిస్తే తీవ్రమైన కాలేయ నష్టానికి సంకేతం అంటున్నారు నిపుణులు. ఫ్యాటీలివర్ తో బాధపడేవారి చేతులు వాపు వచ్చి కదలని స్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి.

ఛాతీలో బిగుతు..

ఛాతీ ప్రాంతంలో వాపు రావడం, బిగుతుగా అనిపిస్తే కాలేయ వ్యాధికి సంకేతం అంటున్నారు నిపుణులు. ఛాతీలో వాపు కలిగే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

కళ్లలో వాపు..

కళ్లు ఉబ్బడం, పసుపురంగులో కళ్లలోని తెల్లసొన కనిపించడం వంటి లక్షణాలు ఉంటే అది కామెర్లు, కాలేయ వైఫల్యానికి సంకేతం అని చెబుతున్నారు. బిలిరుబిన్ శరీరంలో అత్యధికంగా ఉన్నట్లయితే కాలేయం దానిని సరిగ్గా ప్రాసెస్ చేయదు. దీంతో చర్మం, కళ్ళు పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది.

పొత్తికడుపులో వాపు..

పొత్తికడుపులో ఉబ్బరంగా ఉండడం కాలేయ వ్యాధికి సంకేతంగా చెబుతున్నారు. ఈ సమస్య ఎదురైతే ఆలస్యం చేయకుండా వైద్యులని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

కాలు వాపు

కాళ్ళలో వచ్చే వాపును ఎడెమా అని పిలుస్తారు. ఈ వాపు కాళ్ల చీలమండలు, పాదాలలో ద్రవం చేరడం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాపు కాలేయ వ్యాధి ఉన్న వారిలో కనిపిస్తుంది. ఈ రకమైన కాలు వాపు వల్ల అసౌకర్యం, నొప్పి, కాళ్లు కదలలేకపోవడం జరుగుతాయి.

అడుగుల వాపు..

పాదాలలో వాపు కారణంగా నిలబడలేరు, నడవలేరు ? దీన్ని కాలేయం దెబ్బతిన్నదనే సంకేతంగా భావింవచ్చు.



Source link

Related posts

ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించారంటే చర్మం మెరిసిపోవాల్సిందే..

Oknews

వైల్డ్ స్విమ్మింగ్ అంటే ఏమిటి?.. ఇటీవల ఎందుకంత పాపులర్ అయింది?

Oknews

డేటింగ్‌లు మొదలు బ్రేకప్‌ల వరకు.. సోషల్ మీడియా ప్రభావం

Oknews

Leave a Comment