Mohammed Shami And Madushanka Replacements: ఐపీఎల్(Ipl)లో ఆడిన రెండు సీజన్లలోనూ అద్భుత ఆటతీరుతో అలరించిన గుజరాత్ టైటాన్స్(GT) ఈసారి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడి ముంబై(MI) సారధ్య బాధ్యతలు స్వీకరించగా… మహ్మద్ షమీ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు షమీ స్థానంలో గుజరాత్ కొత్త ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. మహ్మద్ షమీ స్థానంలో కేరళ పేసర్ సందీర్ వారియర్‌ను గుజరాత్ జట్టులోకి తీసుకుంది. కనీస ధర రూ.50 లక్షలకు అతడు టైటాన్స్‌తో చేరాడు. 32 ఏళ్ల వారియర్ 2019 నుంచి అయిదు ఐపీఎల్ మ్యాచ్‌లే ఆడాడు. 7.88 ఎకానమీ రేట్‌తో రెండు వికెట్లు పడగొట్టాడు. వారియర్ ఇంతకుముందు కోల్‌కతా, బెంగళూరు, ముంబై తరఫున ఆడాడు. ముంబై ఇండియన్స్ జట్టు గాయపడ్డ శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశంక స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ క్వెనా మపాకాకు జట్టులో స్థానం కల్పించింది. 17 ఏళ్ల మపాకా అండర్-19 ప్రపంచకప్‌లో 21 వికెట్లు పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును కూడా అందుకున్నాడు.
సూర్య కూడా దూరం
ఐపీఎల్ ప్రారంభానికి ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలేటట్టే ఉంది. టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. తాజాగా సూర్య చేసిన పోస్ట్ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. హృదయం బద్దలైనట్లు ఉన్న ఎమోజీని సూర్య ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి సూర్య ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడనే నెటిజన్లు అనుకుంటున్నారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్ అందుబాటులో లేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్య కోలుకుంటాడని అప్పట్లో బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈసారి అదిరిపోతుందబ్బా
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవరూ మరచిపోలేని ప్రదర్శన ఇస్తామని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ముంబై జెర్సీ ధరించడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని అన్నాడు. సొంత గూటికి తిరిగి రావడం ఎప్పుడూ ప్రత్యేకమే అని పాండ్యా అన్నాడు. మలింగ సోదరుడిలా ఉన్నాడని… మార్క్ బౌచర్ ఓ అద్భుతమని కొనియాడాడు. ఎవరూ మరచిపోలేని ఆటతీరు ప్రదర్శిమన్న పాండ్యా… ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ప్రశంసలు కురిపించాడు. బౌచర్ సారథ్యంలో విజయాలకు ఎదురుచూస్తున్నాం. టీమ్‌లో కొంతమంది కొత్తవాళ్లు ఉన్నారు.
మరిన్ని చూడండి