Sports

IPL 2024 Body Blow For Lucknow Super Giants Star Pacer Pulls Out


England pacer David Willey will miss the initial matches of the IPL 2024:  ఐపీఎల్‌(IPL) మరో రోజులో ప్రారంభం కానున్న వేళ కూడా ఐపీఎల్‌ జట్లను గాయాలు కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్‌కూ దూరం అవుతుండడం అభిమానులను, ప్రాంచైజీలను కలవరపెడుతోంది. ఇప్పటికే సూర్యా(Surya), షమీ(Shammi), మధుశంక(Madhushanka) సహా కీలక ఆటగాళ్లు ఆయా ప్రాంచైజీలకు దూరమయ్యారు. తాజాగా మరో ఆటగాడు కూడా ఐపీఎల్‌ తొలి దశ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్‌ విల్లే(David Willey) ఐపీఎల్‌ తొలి దశ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని  లక్నో హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లంగర్‌ తెలిపాడు. రెండు నెలలుగా ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడిన విల్లే.. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత రెండు సీజన్లలో ఆర్సీబీకి ఆడిన విల్లేను ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌.. రూ. 2 కోట్లతో దక్కించుకుంది. రెండ్రోజుల క్రితమే పీఎస్‌ఎల్‌ ఫైనల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరఫున ఆడిన విల్లే.. అక్కడ్నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లాడు. విల్లే రెండో షెడ్యూల్‌కు తిరిగొస్తాడా..? సీజన్‌ మొత్తానికి దూరమవుతాడా..? అనేదానిపై స్పష్టత లేదు. లక్నో కూడా విల్లే రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు.

సూర్య కూడా  ఐపీఎల్‌కు దూరం!
ఐపీఎల్‌ ప్రారంభానికి ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్‌ తగిలేటట్టే ఉంది. టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. తాజాగా సూర్య చేసిన పోస్ట్‌ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. హృదయం బద్దలైనట్లు ఉన్న ఎమోజీని సూర్య ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఇది చూసి సూర్య ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడనే నెటిజన్లు అనుకుంటున్నారు.
 దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి  వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్‌ అందుబాటులో లేదు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య కోలుకుంటాడని అప్పట్లో  బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

మరిన్ని చూడండి



Source link

Related posts

ఒకే రోజు భారత్‍కు 15 పతకాలు.. హాఫ్ సెంచరీ దాటిన మెడల్స్-asian games day 8 highlights india bags 15 medals including to 3 gold check tally ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

GT vs PBKS Highlights IPL 2024: రన్ చేజ్ లో పంజాబ్ కింగ్స్ ను కాపాడిన కుర్రాళ్లు, గుజరాత్ పై విజయం

Oknews

IPL 6 records | IPL 6 records : ఐపీయ‌ల్ లో 6 నంబ‌ర్ రికార్డ్‌లు

Oknews

Leave a Comment