ByGanesh
Thu 21st Mar 2024 04:58 PM
సోషల్ మీడియాలో అనసూయ తర్వాత ఆ ప్లేస్ ని యాంకర్ శ్రీముఖినే ఫిల్ చేస్తుంది. జబర్దస్త్ అందాలతో కవ్వించే అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ యూత్ ని కవ్విస్తుంది. ఆమె తర్వాత మళ్ళీ అదే మాదిరి యాంకర్ శ్రీముఖి రకరకాల కాస్ట్యూమ్స్ తో పిక్స్ షేర్ చేస్తుంది. ఆమె స్టార్ మా లో చేసే ప్రతి ప్రోగ్రాం కి ముందు ఆ అవుట్ ఫిట్స్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ కవ్విస్తుంది. శ్రీముఖి పెళ్లి పై అప్పడప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
అందరిలా నా పేరెంట్స్ పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చెయ్యరు, నాకు పెళ్లి చేసుకోవానుకున్నప్పుడే చేసుకుంటాను అని చెప్పే శ్రీముఖి తాజాగా సారీ లుక్ తో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులోనూ గ్లామర్ చూపిస్తూ కొత్తగా కనిపించింది. మోడ్రెన్ అవుట్ ఫిట్స్ మాత్రమే కాదు సారీలోను అందాలు ఆరబోయ్యొచ్చు అన్నట్టుగా శ్రీముఖి కనిపించింది.
ఎప్పుడూ హుషారుగా కనిపించే శ్రీముఖి గ్లామర్ విషయంలోనూ అస్సలు తగ్గదు. ఓసారి సన్నగా నాజూగ్గా కనబడుతుంది. ఒక్కోసారి కాస్త బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది.
Sreemukhi looks super cool:
Sreemukhi stuns in this glamorous photoshoot