Entertainment

బెదిరింపు కాల్స్‌పై కేంద్రం సీరియస్‌.. ‘రజాకార్‌’ నిర్మాతకు భద్రత కల్పించిన హోంశాఖ!


ఇటీవల విడుదలైన ‘రజాకార్‌’ చిత్రంలోని యదార్థ ఘటనలు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి. భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. కానీ, అప్పుడు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ మాత్రం 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆధీనంలో ఉంది. దేశంలో హైదరాబాద్‌ను విలీనం చేయకుండా ముస్లిం రాజ్యం ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. నిజాం సైనికాధికారి ఖాసీం రజ్వీకి బాధ్యతలు అప్పగించాడు. తన అరాచకాలతో తెలంగాణలో విధ్వంసం సృష్టించాడు రజ్వీ. అప్పటి హోంశాఖ మంత్రి వల్లభాయ్‌ పటేల్‌ చొరవవల్ల హైదరాబాద్‌ని దేశంలో విలీనం చేసి మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాకిస్తాన్‌ పారిపోయాడు. అతని ఆధీనంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కష్టాలను ‘రజాకార్‌’ సినిమాలో ఇప్పటి ప్రజలకు అర్థమయ్యేలా చూపించారు. 

ఈ సినిమాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్‌ చెయ్యాలని భావించారు దర్శకనిర్మాతలు. కానీ, కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణరెడ్డికి దాదాపు 1100 బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే ఆయనకు 1+1 సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లను భద్రత నిమిత్తం కేటాయించింది. ‘రజాకార్‌’ చిత్రానికి యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు. 



Source link

Related posts

locked off with sunny leone a new program started by sunny leone

Oknews

'మూడో కన్ను' మూవీ రివ్యూ 

Oknews

మైత్రితో విజయ్ మూడో సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Oknews

Leave a Comment