Entertainment

జ్యోతిక భర్త అప్పుగా కావాలంట..ఈ విషయం సూర్యకి తెలిస్తే 


తమిళ అగ్ర హీరో సూర్య, జ్యోతికలు  ఈ మధ్యనే చెన్నై నుంచి ముంబై కి షిఫ్ట్  అయ్యారు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నా కూడా జ్యోతిక మాత్రం పిల్లల చదువు కోసమే అని చెప్తుంది. ఆ విషయాలన్నీ పక్కన పెడితే  రీసెంట్ గా  జ్యోతిక కి ఒక యువతికి మధ్య  జరిగిన చర్చ ఇప్పుడు టాక్ అఫ్ ది డే అయ్యింది.

పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జ్యోతిక ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది. తమిళంతో పాటు హిందీలోను సినిమాలు  చేస్తుంది. ఇక ఆమె గత కొంతకాలం నుంచి  సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఒక యువతీ నుంచి జ్యోతిక కి మెసేజ్ వచ్చింది. మేడం నేను సూర్య గారికి చాలా పెద్ద అభిమానిని. సిల్లును ఓరు కాదల్ మూవీలో లాగా సూర్యగారిని ఒక రోజు నాకు అప్పుగా ఇస్తారా అని అడిగింది. ఉప్స్ అలాంటివేం కుదరదంటు జ్యోతిక రిప్లై ఇచ్చింది. 

దీంతో  సదరు యువతి  జ్యోతిక మేడం నాకు  రిప్లై  ఇచ్చిందంటు చాలా ఆనందపడింది. మళ్ళీ కొన్ని కామెంట్స్ చేసింది.  నాకు సూర్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు. నా పేరులో కూడా సూర్య అనే పేరుని యాడ్ చేసుకున్నాను. అయినా మీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా తక్కువ. అయినా సూర్య ఎప్పడు మీ వాడే అంటూ చేసింది.  ఇప్పడు ఈ ఇద్దరి చాట్ మొత్తం  వైరల్ గా మారింది. జ్యోతిక  మళ్ళీ ఎలాంటి రిప్లై ఇస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. అలాగే ఈ విషయం సూర్యకి తెలిస్తే ఎలా ఉంటుందంటూ అందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు.

 



Source link

Related posts

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్.. 'మగధీర' రీ రిలీజ్…

Oknews

త‌న సినిమా పేరు మ‌ర‌చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Oknews

kajal aggarwal marriage photos: ముంబైలో ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి…అనుకోకుండా షాకింగ్ ఘటన

Oknews

Leave a Comment