EntertainmentLatest News

థ్రిల్లర్ లవర్స్ కి ఆ సిరీస్ ఓ ఫీస్ట్.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే!


సిటీలో బిజీ లైఫ్స్​ ని గడుపుతున్న వారందరికి థియేటర్లకు వెళ్లి చూసేంత టైమ్ ఉండదు. మరి అలాంటి సినీ ప్రియుల కోసం అప్పుడుప్పుడు ఇంట్లో తమకిష్టమైన సినిమాలను స్ట్రీమ్​ చేసుకోడానికి అనేక ఓటీటీ మధ్యామాలు వచ్చేశాయి. అవి ప్రతీవారం డిఫరెంట్ కాన్సెప్ట్స్​తో కంటెంట్​ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్స్​ను ఇష్టపడేవారి కోసం తాజాగా పలు సినిమాలు, సిరీస్​లు రిలీజయ్యాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.

నిన్న మొన్నటి దాకా  నాగ చైతన్య చేసిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘ దూత’. ఈ సిరీస్ గతేడాది డిసెంబర్ ఒకటిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అత్యధిక వీక్షకాధరణ తెచ్చుకుంది‌. ఇక ఈ మధ్యకాలంలో ‘ ది కేరళ స్టోరీ ‘. ఖాండాలు దాటి తన విజయపరంపర కొనసాగిస్తోంది. ఇక అదే కోవలో తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ భ్రమయుగం’ అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో అత్యధిక ప్రేక్షకాధరణ పొందాయి. మన తెలుగులో ‘ హాఫ్ స్టోరీస్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఈ మధ్య అత్యధిక వీక్షకాధరణ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు అదే కోవలోకి మరో సిరీస్ చేరింది‌. అదే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ కుడి ఎడమైతే’. థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఓ ఫీస్ట్ అని చెప్పేయొచ్చు.

వినూత్నమైన కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది ‘కుడి ఎడమైతే’ సిరీస్​. పవన్ కుమార్ రూపొందించిన ఈ థ్రిల్లర్ కమ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ సమయం తెలియనంత డీప్​గా కథలోకి తీసుకెళ్లిపోతుంది. అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా కథ నడుస్తోంది. వీళ్లిద్దరూ ఒక రోజు అనుకోకుండా టైమ్ లూప్​లో ఇరుక్కుపోతారు. పదేపదే అదే ఘటనను ఎదుర్కొంటూ వాళ్లు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు. అందులో నుంచి ఎలా బయటపడ్డారనేది కథనం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సిరీస్​ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ని మీ వాచ్​లిస్ట్​లో పెట్టేసుకోండి మరి.

 



Source link

Related posts

Telangana News Political excitement over Pedpadalli MP seat in BRS Karimnagar

Oknews

ప్రభాస్ కోసమా? అమితాబ్ కోసమా?

Oknews

అయ్యో అయ్యో అయ్యయ్యో.. ఈ సినిమాల పరిస్థితి ఏంటి?

Oknews

Leave a Comment