వైన్స్ బంద్హోలీ పండుగ రోజున హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు(Liquor Shops), బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad Commissionerate), సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, కల్లు దుకాణాలు బంద్ చేసి ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో బార్స్, స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. హోలీ వేడుకల్లో రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, బైక్‌లపై తిరుగుతూ న్యూసెన్స్ చేయడం, రోడ్లపై ఇతరులపై రంగులు పూయడం, రోడ్లపై హోలీ వేడుకలు(Hyderabad Holi Celebrations) చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Source link
previous post