GossipsLatest News

Rukmini Vasanth in Kantara Chapter 1 కాంతార 1లో కత్తిలాంటి హీరోయిన్



Sat 23rd Mar 2024 05:12 PM

rukmini vasanth  కాంతార 1లో కత్తిలాంటి హీరోయిన్


Rukmini Vasanth in Kantara Chapter 1 కాంతార 1లో కత్తిలాంటి హీరోయిన్

కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారకి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న కాంతార 1 షూటింగ్ సైలెంట్‌గా జరిగిపోతుంది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా మొదలైన ఈ చిత్రంపై ప్యాన్ ఇండియా మార్కెట్‌లో భీభత్సమైన క్రేజ్ ఉంది. షూటింగ్ చిత్రీకరణలో ఉన్న కాంతార చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా చిత్రంలోకి ఓ క్రేజీ హీరోయిన్ ఎంటర్ అవ్వబోతోంది.

సప్తసాగరాలు దాటి చిత్రంలో అందరి మనసులని దోచేసిన రుక్మిణి వసంత్ ఈ ప్యాన్ ఇండియా చిత్రం కాంతారలో అవకాశం దక్కించుకుంది అంటున్నారు. కాంతార మేకర్స్ రుక్మిణి వసంత్‌ని సంప్రదించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారనే టాక్ నడుస్తుంది. మరి ఇది నిజమైతే రుక్మిణి లక్కీ అనే చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ ఫిల్మ్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్న రుక్మిణి.. ఈమధ్యనే కోలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిందనేలా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు కాంతార చిత్రం కోసం రుక్మిణి‌కి లుక్ టెస్ట్ కూడా చేశారనేలా టాక్ వినబడుతోంది. ఇక కాంతార షూటింగ్ విషయానికొస్తే.. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం రిషబ్ తన సొంత విలేజ్ అయిన కేరడి గ్రామంలో ఓ పెద్ద సెట్ వేసి షూటింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.


Rukmini Vasanth in Kantara Chapter 1 :

Rukmini Vasanth to Star in Rishab Shetty Film Kantara Chapter 1









Source link

Related posts

Anupama Remuneration for Tillu Square టిల్లుకి అనుపమ రెమ్యూనరేషన్!

Oknews

Nani Who Shocked Balagam Venu బలగం వేణుకి నాని షాక్

Oknews

New president of AP TDP..! ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు..!

Oknews

Leave a Comment