EntertainmentLatest News

రెండు పాన్‌ ఇండియా మూవీస్‌లో తన పవర్‌ చూపించేందుకు రెడీ అవుతున్న అనుష్క!


2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క మరో సినిమా చెయ్యలేదు.  హీరోయిన్‌గా ఆమె జోరు తగ్గింది అనుకుంటున్న టైమ్‌లో 2023లో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ హీరోయిన్‌గా అనుష్క బిజీ అవుతుందని అందరూ భావించారు. కానీ, సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తూ ఆశించినంత జోరు చూపించడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’లో తొలుత అనుష్కను హీరోయిన్‌గా అనుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా అవకాశం వచ్చినప్పటికీ మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారన్న విషయం తెలియడంతో ఆ సినిమా చెయ్యకూడదని డిసైడ్‌ అయింది. యువి క్రియేషన్స్‌ అంటే అనుష్క సొంత సంస్థలాంటిది. అలాంటి బేనర్‌లో చిరంజీవి సినిమాను కూడా కాదనుకుంది అంటే ఆలోచించాల్సిందే. 

తాజాగా క్రిష్‌ దర్శకత్వంలో ‘ఘాటి’ చిత్రానికి ఓకే చెప్పింది. ‘వేదం’ చిత్రంలో వేశ్య పాత్ర చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఉత్తమనటిగా ఫిలింఫేర్‌ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు అదే దర్శకుడి సినిమా చేసేందుకు రెడీ అయింది అనుష్క. ‘ఘాటి’ చిత్రంలో అనుష్క క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ ఉన్న సినిమాయే కాకుండా కథ అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుందట. అందుకే ఆ క్యారెక్టర్‌ చేసేందుకు టెంప్ట్‌ అయింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ్‌ సినిమాల్లోనే నటించిన అనుష్క మొదటిసారి ఒక మలయాళ సినిమాలో నటించబోతోంది. అనుష్క సొంత రాష్ట్రం కర్ణాటక అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కన్నడ సినిమా కూడా చెయ్యలేదు. మలయాళంలో ఆమె చేస్తున్న సినిమా పేరు ‘కథనర్‌’. హారర్‌ టచ్‌తో కూడిన జానపద సినిమా అది. ఇందులో కూడా ఆమెకు పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న క్యారెక్టరే దక్కింది. ఘాటి, కథనర్‌ రెండూ ప్యాన్‌ ఇండియా సినిమాలే. ‘ఘాటి’ చిత్రాన్ని ఈ సంవత్సరమే రిలీజ్‌ చెయ్యాలనేది క్రిష్‌ ప్లాన్‌. ‘కథనర్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నారు మేకర్స్‌.  



Source link

Related posts

Urvasi that raised expectations on NBK109 NBK109 పై అంచనాలు పెంచేసిన బ్యూటీ

Oknews

TS National Means Cum Merit Scholarship Scheme (NMMSS) Examination Application Last Date Extended Up To 08-11-2023

Oknews

police constable saved farmer life in karimnagar district | Karimnagar News: శభాష్ పోలీస్

Oknews

Leave a Comment