GossipsLatest News

Brothers Bigfight.. Bejawada Eto..! బ్రదర్స్ బిగ్‌ఫైట్.. బెజవాడ ఎటో..!


నాని వర్సెస్ చిన్ని.. గెలుపెవరిదో..?

అవును.. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అంటూ ఢీ కొంటున్నాయి. ఇప్పటికే కూటమిలో భాగంగా టీడీపీ దాదాపు అభ్యర్థులను ప్రకటించేయగా.. ఇక జనసేన, బీజేపీ నుంచి జాబితా ఫైనల్ కాలేదు. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. విజయవాడ టికెట్ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి ఇచ్చారు. ఇక వైసీపీ తరఫున కేశినేని నాని పోటీ చేస్తున్నారు. సీన్ ఎలా ఉండబోతోందంటే.. ఏమండోయ్ నాని గారు.. ఏవండోయ్ చిన్నిగారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. బ్రదర్స్ కాస్త వర్సెస్ అవ్వడంతో గెలుపు ఎవరిది..? బెజవాడ కింగ్ ఎవరు కాబోతున్నారు..? అంటూ పెద్ద ఎత్తున చర్చ.. అంతకుమించి బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్.

బెజవాడ ఎటు..?

అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో బెజవాడ ఎటువైపు ఉంటుంది.. అన్నను ఆదరిస్తారా..? లేకుంటే పార్టీ మారి తప్పుచేశాడని పక్కనెట్టి.. తమ్ముడినే గెలిపించి చట్టసభల్లోకి పంపుతారా..? అంటూ విజయవాడలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే.. అనుభవం, సేవాగుణం, నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఏం చేశారు..? పైగా వైసీపీలోకి వెళ్లడంతో పార్టీ తరఫున లబ్ధిదారులు ఎవరు..? టీడీపీలో ఆయనకు జరిగిన అవమానం..? అన్నదమ్ముల మధ్య చంద్రబాబు పెట్టిన చిచ్చు.. ఇవన్నీ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి నానికి ఉన్న ఫాలోయింగ్.. చిన్నికి లేదనే చెప్పాలి. మాస్‌కు మాస్‌గా.. క్లాస్‌కు క్లాసుగానూ.. ఇక అభివృద్ధి అంటారా ఎంపీగా ఉన్న రెండు పర్యాయాలు తానేంటో చూపిస్తూ వచ్చారు. దీనికి తోడు ప్రజల్లో నిత్యం ఉండే మనిషి.. సేవా కార్యక్రమాలు చేపట్టడంలోనూ ముందుండే వారు. ఒకవేళ పార్టీ మారాడనే కోపం జనాల్లో ఉన్నప్పటికీ.. వ్యక్తిని చూసి ఓటేసే పరిస్థితే ఉంటుందని నాని అనుచరులు చెప్పుకుంటున్నారు.

ఏం జరుగుతుందో..?

ఇక చిన్ని విషయానికొస్తే.. ఈయన కూడా సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలోనే ఉంటారు. ఇక అనుభవం మాత్రమే లేదు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా గట్టిగానే ఉన్నారు. అందుకే ఈ సీటు కోసం ఎంతోమంది పోటీ పడినప్పటికీ చిన్నికే చంద్రబాబు ఓటేశారు. అయితే.. చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ గేమ్‌కు చిన్ని బలవుతున్నారని ఆయనకు ఓటేసినా ప్రయోజనం లేదని కూడా స్థానికంగా గట్టిగానే చర్చ జరుగుతోంది. వాస్తవానికి అన్న రెండు సార్లు ఎంపీగా గెలవడంలో తమ్ముడు పాత్ర కీలకం. యూత్‌లో మంచి ఫాలోయింగ్, అన్నను గెలిపించిన అనుభవం.. ఇక సామాజిక వర్గం దీనికితోడు నానితో వెళ్లకుండా టీడీపీలోనే ఉండిపోయిన కేడర్ ఇవన్నీ కలిసొస్తాయని చిన్ని.. తెలుగుదేశం హైకమాండ్ భావిస్తోంది. బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఈ బిగ్‌ఫైట్‌లో నానికే ఎక్కువగా గెలుపు అవకాశాలున్నాయన్నది సర్వేలు కూడా చెబుతున్నాయి. మరి ప్రజలు ఎవర్ని గెలిపిస్తారో.. ఎవర్ని ఓడించి ఇంటికి పంపుతారో తెలియాలంటే జూన్-04 వరకూ వేచి చూడాల్సిందే.





Source link

Related posts

మహేష్ మ్యాజిక్ కి 25 ఏళ్ళు!

Oknews

నత్తి పాత్రలో ప్రభాస్.. 'రాజా సాబ్' స్టోరీ ఇదే!

Oknews

ఈ సినిమాలు చూడాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే!

Oknews

Leave a Comment