వచ్చే 5 రోజులు ఎండలుతెలంగాణలో(Telangana Weather) మార్చి నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సగటున ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. నేటి రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Department) హెచ్చరికలు జారీచేసింది. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు దిగువ స్థాయిగా గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తు్న్నారు. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు(Telangana Temperatures) నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాత్రి పూట సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఎండలో బయటకు వెళ్తే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Source link