Sports

IPL 2024 RR vs LSG Sanju Samson Trent Boult shine as Rajasthan defeat Lucknow by 20 runs | IPL 2024 RR vs LSG: రాజస్థాన్‌కు తొలి విజయం


 Sanju Samson Trent Boult shine as Rajasthan defeat Lucknow by 20 runs:  తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి ఐపీఎల్‌(IPL)ను రాజస్థాన్‌(RR) ఘనంగా ఆరంభించింది. లక్నో(LSG)తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 173 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో లక్నోపై రాజస్థాన్‌ విజయం సాధించింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ 52 బంతులు ఎదుర్కొని .. 3 ఫోర్లు, 6 సిక్సులతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లక్నో కెప్టెన్‌ కె.ఎల్‌. రాహుల్‌ అర్ధ శతకంతో రాణించినా లక్నోకు ఓటమి తప్పలేదు. పూరన్‌ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచినా లక్నోను గెలిపించలేకపోయాడు. 

 

రాణించిన శాంసన్‌ 

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌కు.. ఆదిలోనే షాక్‌ తగిలింది. నవీనుల్‌ హక్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ అవుటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ క్రీజులో ఉన్నంతసేపు చురుగ్గా కదిలాడు. 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సు బాది 24 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌.. నవీనుల్ హక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. రాజస్థాన్‌ కెప్టెన్ సంజు శాంసన్‌.. రియాన్‌ పరాగ్‌ సహకారంతో స్కోర్‌ బోర్డు జోరు పెంచాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈజోడి క్రమంగా వేగం పెంచింది. 10 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం సంజు శాంసన్ 33 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత సంజు దూకుడు కొనసాగించాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న రియాన్‌ పరాగ్‌ను నవీనుల్‌ హక్‌ అవుట్‌ చేశాడు. 29 బంతుల్లో 1 ఫోర్‌, మూడు సిక్సులతో 43 పరుగులు చేసి రియాన్‌ పరాగ్ వెనుదిరిగాడు.  దీంతో 142 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. కాసేపటికే హెట్‌మయర్‌ను రవి బిష్ణోయ్ అవుట్‌ చేశాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 17 ఓవర్‌లో మూడో బంతికి వికెట్ కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి… అయిదు పరుగులు చేసిన హెట్‌మెయిర్‌ అవుటయ్యాడు. చివర్లో ధ్రువ్‌ జురెల్‌ మెరుపులతో రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

 

లక్ష్య ఛేధనలో డీలా..

194 పరుగుల లక్ష్య చేధనలో లక్నోకు ఆదిలోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. క్వింటన్‌ డికాక్‌ నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. కాసేపటికే దేవదత్‌ పడిక్కల్ డకౌట్‌ అయ్యాడు. తర్వాత బదోని కూడా పెలివియన్‌ చేరడంతో లక్నో 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రాహుల్‌..దీపక్ హుడా లక్నో స్కోరు బోర్డును కాసేపు ముందుకు నడిపించారు. కానీ 13 బంతుల్లో 26 పరుగులు చేసిన హుడాను చాహల్‌ అవుట్‌ చేసి లక్నోను దెబ్బ తీశాడు. తర్వాత పూరన్‌తో జతకలిసిన రాహుల్‌ మళ్లీ గెలుపు ఆశలు రేపాడు. పూరన్‌ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. రాహుల్‌ కూడా 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో లక్నో 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

బంగ్లా పై స్వారీ..సెమీస్ కు అదే దారి

Oknews

Ind Vs Eng 5th Test Dharamsala Team India Allout At 477 Lead By 259

Oknews

SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్

Oknews

Leave a Comment