Health Care

హార్ట్ ఫెయిలయ్యేముందు కనిపించే లక్షణాలు ఇవే..


దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వివిధ గుండె ఆరోగ్య సమస్యలు గుండెను ప్రభావితం చేయడమే కాకుండా కొన్నిసార్లు మరణానికి కారణం అవుతాయి. అయితే కరోనరీ ఆర్టరీ వ్యాధి, క్రమరహిత హృదయ స్పందన, హార్ట్ వాల్వ్ సంబంధిత వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బు,గుండె కండరాల వ్యాధి ఇలా మొదలైనవి చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక వీటనిటిలోకెల గుండె సంబంధిత సమస్యల్లో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఒకటి. ఈ పరిస్థితి వస్తే గుండె పనితీరు దెబ్బతినడమే కాకుండా హటాత్ మరణం సంభవిస్తుంది. అయితే ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి ముందుగానే తగిన సమయంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం కలగకుండా ఉంటుంది. మరి ఏంటా లక్షణాలు చూదాం.

హార్ట్ ఫెయిల్యూర్ ముఖ్య లక్షణాలు :

1. హార్ట్ ఫెయిల్యూర్ కావడానికి ముందు మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చిన్న పని చేసిన, కోంచం బరువు ఎత్తిన కూడా ఎక్కువ ఆయాసం పడిపోతారు. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు, వేగంగా నడిచేటప్పుడు, ఊపిరి అందడం చాలా కష్టంగా మారుతుంది. ఏ పని చేసినా ఊపిరి తీసుకోలేరు. విపరీతమైన నీరసం, అలసిపోయినట్లు అవుతారు. ఇలాంటివి జరిగితే మీ గుండె ఆరోగ్యం బాగోలేదని అర్థం.

2. అలాగే పాదాలు, కాళ్లు, నీరు చేరి ఉబ్బటం.. పొత్తి కడుపు దగ్గర కూడా నీరు చేరడం దీనివల్ల మీరు లావుగా కనిపిస్తారు. గుండె కొట్టుకునే వేగం మారుతుంది. వేగంగా గట్టిగా మీ గుండె కొట్టుకునే శబ్దం మీకే వినిపిస్తుంది. ఇలాంటి లక్షణాలను తేలికగా తీసుకోకండి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.

3. గుండె సమస్యతో బాధపడేవారు వారికి తెలియకుండానే ఆకస్మికంగా బరువు పెరుగుతారు. ఇలా పెరిగారంటే మీలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఆకలి వేయదు.. తినకపోయినా వికారంగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

4. శ్వాస తీసుకున్నప్పుడు గురక పెట్టిన కూడా మంచిది కాదు. అతి గురక మనిషి గుండెను చాలా దెబ్బతీస్తుంది. నిద్రలోనే గుండె ఆగిపోయి చనిపోయేలా చేస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధికి ముఖ్య లక్షణం. గుండె విఫలం అవ్వడానికి ముందు దగ్గు అధికంగా వస్తుంది.. దగ్గుతో పాటు కొంత శ్లేష్మం కూడా పడుతుంది.

5. ఇప్పుడు ఉన్న  మెంటల్ టెన్షన్స్‌కి యువతలో ఎక్కువగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. హార్ట్ ఫెయిల్ అవుతున్న సందర్భాలు కూడా అధికంగా ఉన్నాయి. అందుకే ప్రతి ఒక చిన్న విషయానికి గాబర పడిపోకుండా నిదానంగా ఆలోచించుకుని ముందడుగు వేయాలి. మన శరీరంలోని సున్నితమైన అవయవాల్లో గుండె చాలా ముఖ్యమైంది. కనక దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి.. అలాగే గుండె ఆరోగ్యం కోసం పోషకాహారాన్ని తీసుకుంటూ.. ధ్యానం వంటివి చేస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి.



Source link

Related posts

అమ్మాయిల్లో అటెన్షన్ సీకింగ్ అనర్థమా.. కొందరు ఎందుకని అర్థం చేసుకోలేకపోతారు?

Oknews

ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

Oknews

Dark Oxygen : సృష్టి ఉద్భవించింది ఈ మహాసముద్రంలోనే.. అంతుచిక్కని రహస్యాన్ని గుర్తించిన శాస్త్రవేత్త

Oknews

Leave a Comment