దిశ, ఫీచర్స్: జ్యోతిషశాస్త్రంలో రెండు గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సైన్స్ ప్రకారం, ఈ గ్రహణాలు సంభవించడం అననుకూలంగా పరిగణించబడుతుంది. అయితే, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం చైత్ర నవరాత్రుల ముందు ఏర్పడనుంది. ఈ సమయంలో మీన రాశిలో శుక్రుడు, రాహువు, సూర్యుడు కలవనున్నారు. కుజుడు అతి త్వరలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే అదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
మొదటి సూర్యగ్రహణం కారణంగా మేషరాశి వారి జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వారి కెరీర్‌కు సంబంధించి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కూడా ఈ సమయంలో చాలా బాధలను అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశి వారి ప్రేమ జీవితంలో పెద్ద మార్పులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కూడా వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి, రెండు సార్లు ఆలోచించండి. ఈ సమయంలో కోపం తగ్గించుకోకపోతే చాలా నష్ట పోతారు.