Health Care

గంజాయి తాగినపుడు నవ్వుతూ ఎందుకుంటారు.. కారణం ఏంటో తెలుసుకుందామా..


దిశ, ఫీచర్స్ : హోలీకి, గంజాయికి మధ్య అనుబంధం వందల సంవత్సరాల నాటిది. అయితే చాలామంది గంజాయి తాగిన తరువాత గంటల తరబడి నవ్వుతూనే ఉంటారు. అలాగే నృత్యం చేయడం ప్రారంభిస్తే వారి పాదాలు గంటల తరబడి ఆగకుండా ఆడుతూనే ఉంటాయి. భారతదేశంలో శివరాత్రికి, హోలీకి, గంజాయిని ఉపయోగించే ట్రెండ్ ఉంది. అయితే ఈ పద్ధతి వినడానికి, చూడడానికి భిన్నంగా ఉంటుంది. దీన్ని చాలామంది డైరెక్టుగా కాకుండా తండైలో కలుపుకుని తాగుతారు. ఇంతకీ దీన్ని ఎందుకు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

భాంగ్‌ని ఆంగ్లంలో Cannabis, Marjuana, Weed అంటారు. దీన్ని తిన్న తర్వాత ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణం హ్యాపీ హార్మోన్ విడుదల కావడం. భాంగ్ శరీరంలోకి చేరిన తర్వాత డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. దాన్ని హ్యాపీ హార్మోన్ అంటారు. ఇది మనుషుల మానసిక స్థితిని నియంత్రిస్తుంది. సంతోషం స్థాయిని పెంచుతుంది. మాట్లాడే వ్యక్తి తన మాటలను పదే పదే చెప్పడానికి కారణం కూడా ఇదే. గంజాని తీసుకుంటూ ఎవరైనా నవ్వితే నిరంతరం నవ్వుతూనే ఉంటారట. అందుకే చాలామంది దీనికి బానిసలు అవుతుంటారు.

ఎంత త్వరగా ప్రభావాన్ని చూపుతుంది ?

గంజాయి మత్తు దాని ప్రభావాలను వివిధ మార్గాల్లో చూపుతుంది. ఒక వ్యక్తి ఎంత త్వరగా మత్తులోకి వస్తాడు అనేది అది తీసుకునే రూపాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఉదాహరణకు గంజాయిని సిగరెట్‌లు లేదా బీడీలలో వాడితే, దాని ప్రభావం కొన్ని సెకన్లలోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు పొగను చాలా త్వరగా గ్రహిస్తాయి. ఈ ప్రభావం మెదడుకు త్వరగా చేరుతుంది.

గంజాయి తిన్నా, తాగినా వెంటనే మత్తు వచ్చేస్తుంది. దీని ప్రభావంతో మెదడు కొంత సమయం వరకు హైపర్‌యాక్టివ్‌గా మారుతుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ప్రమాదాలు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. దీని వల్ల కలిగే నష్టాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం.

గంజాయితో ఏర్పడే ప్రమాదాలు..

గంజాయి మెదడు పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే మెదడు సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. అతిగా గంజా తీసుకున్న వారు దృష్టిని కోల్పోవడం ప్రారంభమవుతుంది. అలాగే రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు. కళ్ళు ఎర్రగా కనిపించడం ప్రారంభిస్తాయి. శ్వాసకోశ సమస్యలు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా గంజాయిని మత్తుకే కాకుండా మందులలో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 25 శాతం మంది గంజాయిని ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీన్ని ఔషధంగా వాడుతున్నా, వైద్యుల సలహా లేకుండా తీసుకోవడం సరికాదు.



Source link

Related posts

తిన్న అన్నం అరగడం లేదా.. ఇలా చేయండి!

Oknews

రుద్రాక్షను ధరించడం వల్ల మనకి కలిగి లాభాలు ఏంటో తెలుసా!

Oknews

ప్రామిస్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

Oknews

Leave a Comment