దిశ, ఫీచర్స్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోలీ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ కలర్స్ చల్లుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనంలలో 16 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ హోలీ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని జనాల నమ్మకం. అయితే ఏ ఫెస్టివల్ అయినా డిటాక్స్ తప్పనిసరి. లేకపోతే శరీరంలో ఇబ్బందులు కలుగుతాయని.. కాగా బాడీ డిటాక్స్ చేసుకునేందుకు పలు చిట్కాలు పాటిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
హోలీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాక గట్-ఫ్రెండ్లీ, న్యూట్రీషియన్ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే సాఫ్ట్ ఫుడ్ తో పాటు, పానీయాలు తీసుకోవాలి. పండగ సమయంలో కొంతమంది అతిగా తింటుంటారు. కానీ అది మన శరీరానికి హాని చేస్తుంది. కాగా గ్లాసు గోరువెచ్చని వాటర్ రెడీ చేసుకోండి. ఆ నీటిలో నిమ్మకాయ రసంను యాడ్ చేసి తాగండి. దీంతో హోలీ వేడుకల సమయంలో శరీరంలో ఉన్న టాక్సిన్ ను తొలగించడానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మరసం మీ ఆరోగ్యానికి కూడా మంచిది.
అలాగే హోలీ సమయంలో ఇష్టమొచ్చిన ఫుడ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా శరీరంలోకి వెళ్తాయి. కాగా కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ తినడం మానేయాలి. కాయధాన్యాలు, బీన్స్, చేపలు వంటి ఫుడ్ తింటే బాడీలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో ఎంతో సహాయపడతాయి. వీటితో పాటు ఇంట్లో తయారు చేసిన డైటరీ ఫైబర్ అధికంగా ఉండే కిచ్డీ, పెరుగు తీసుకోండి.