Health Care

మార్కెట్ మాయాజాలం.. ప్రేమను నిలబెట్టుకోవడానికి అప్పులు చేసి, అవస్థలు పడుతున్న యువత


దిశ, ఫీచర్స్ : ఏ విషయంలో అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటుంటారు. కానీ ఈ మధ్య ప్రజలు, ముఖ్యంగా యువత జీవితంలోని అనేక సందర్భాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. లవ్ అండ్ డేటింగ్, అదర్ రిలేషన్ షిప్స్ కొనసాగించే విషయంలో అదే జరుగుతోంది. ఇక్కడ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలకంటే వారికి తెలియకుండానే బయటి పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి. తమ అనుబంధాలను కొనసాగించే క్రమంలో అవసరాన్ని బట్టి కాకుండా మార్కెట్‌లో ఆకర్షణీయంగా ఉన్నవాటిని లేదా అందరూ గొప్పగా భావించే వస్తువులను, దుస్తులను కొనడం, ఆ తర్వాత ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవడం కామన్ అయిపోతోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న వస్తు వ్యామోహం, మార్కెట్ మాయాలజాలంలో పడి యువతరం ఇలా అనేక విషయాల్లో నష్టపోతోందని నిపుణులు చెప్తున్నారు.

మారుతున్న మైండ్ ‌సెట్

తమ ప్రేమను వ్యక్తం చేయడానికి లేదా ఎక్కువ ప్రేమ ఉందని తెలియజేయడానికి వివిధ వస్తువులు, ఫ్యాషన్ దుస్తులు, ఆభరణాలు, ఇతర బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటోంది. ఇక్కడ ప్రేమ లేదా సంబంధం బలంగా ఉండటం ఏమోకానీ తమ సంబంధాలను నిలబెట్టుకునే క్రమంలో అధికంగా ఖర్చు చేయడంవల్ల మార్కెట్ వ్యవస్థలో లాభాలకోసం పనిచేసే వ్యాపారస్తులకు మాత్రం మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే లవ్ సెంటిమెంట్స్‌ కూడా ఖరీదైన వస్తువుల్లో చూసుకునేలా ఈతరం మైండ్‌సెట్‌ను మార్కెట్ వ్యవస్థ మార్చేస్తోంది. ఎంతలా అంటే నేడు అనేకమంది ప్రేమను వ్యక్తం చేయడానికి, ఫస్ట్ డేట్‌ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టడం కనిపిస్తోంది. ఈ పరిస్థితివల్లే జెన్ జెర్స్, అలాగే మిలీనియల్స్ అప్పుల్లో కూరుకుపోయి అవస్థలు పడుతోంది.

డేటింగ్ కోసం అప్పులు

ఒక నివేదిక ప్రకారం సగటున ఒక అమెరికన్ లేదా అదర్ వెస్ట్రన్ కంట్రీస్‌కి చెందిన తన లైఫ్‌టమ్‌లో ప్రేమించే వ్యక్తికోసం ఖర్చు చేయడానికి 1, 20,000 డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడట. ఇక రొమాంటిక్ డిన్నర్స్, మూవీస్, తరచూ కలుసుకునే సందర్భంగా ఖర్చు పెట్టడానికి, బహుమతులు ఇవ్వడానికి, దుస్తులు, కాస్మెటిక్స్ కొనడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నారు. ‘లెండింగ్‌ ట్రీ’ సర్వే ప్రకారం 22 శాతం మిలీనియల్స్, అలాగే 19 శాతం మందిGen Z గొప్పలకు పోయి ‘డేటింగ్ రుణం’’ కూడా పొందుతున్నారు. తమ ప్రేమ లేదా సంబంధాలను గొప్పగా చెప్పుకోవడానికి అధికంగా ఖర్చు చేసి, అప్పులపాలై తిప్పలు పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఈ బలహీనత కొనసాగుతోంది.

దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు

18 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 29 శాతం డేటింగ్‌లో భాగంగా మొదటిసారి కలుసుకోవడానికి అప్పులు చేస్తున్నారు. 21 శాతం మంది ఒక సంవత్సర కాలంలో దాదాపు 500 డాలర్లకు మించి ఖర్చు చేస్తున్నారు. అధికంగా ఖర్చు చేయడంవల్ల 29 శాతం మంది, తమ డేటర్స్‌ను ఇంప్రెస్ చేసే క్రమంలో 28 శాతం మంది, మరింత సాన్నిహిత్యాన్ని కోరుకునే క్రమంలో 19 శాతం మంది ఖర్చు పెట్టడానికి అప్పులు చేసి, అవస్థలు పడుతున్నారు.



Source link

Related posts

వాయిస్ పడిపోయిందా?.. నో ప్రాబ్లం.. కదలికలను బట్టి మాటలు పలికించే AI స్టిక్కర్స్‌ ఉన్నాయిగా..

Oknews

ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన ఎన్ని లాభాలో?

Oknews

ఏసీ ఉపయోగించిన కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాల్సిందే..!

Oknews

Leave a Comment